టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో శర్వానంద్ తాజాగా నటించిన సినిమా “మనమే”. ఈ సినిమాలో ఆయనకు జోడిగా యంగ్ బ్యూటీ కృతిశెట్టి నటించింది. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తనదైన స్టైల్ లో దర్శకత్వం వహించారు . పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. మొదటిసారి కృతి-శర్వా కపుల్ గా ఈ సినిమాలో కనిపిస్తూ ఉండడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు. అంతేకాదు ఇప్పటికే విడుదలైన సినిమాలోని పాటలు ..పోస్టర్స్.. టీజర్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునింది .
మరీ ముఖ్యంగా ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ ఫిలిం తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ . మనమే ట్రైలర్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది . ట్రైలర్లో శర్వానంద్ కృత్తి శెట్టిని ఎంత ఇబ్బంది పెడతాడొ .. తన అల్లరి చిల్లరి మాటలతో వేషాలతో అనే విషయం క్లియర్ గా చూడొచ్చు . అంతేకాదు శర్వానంద్ తన కొడుకుకి అన్ని పనులు చేస్తాడు. కానీ అది కృతి శెట్టికి ఇష్టమైన విధంగా చేయడు. కృతిశెట్టి అన్ని టైం టు టైం ఫాలో అవ్వాలి అనుకుంటుంది.
కానీ శర్వానంద్ అలా కాదు నేటి జనరేషన్ కి తగ్గట్టు పెంచాలి అనుకుంటాడు . ఈ రెండిటి కారణంగా వీళ్ళ మధ్య వచ్చే ఫన్నీ ఫన్నీ సీన్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి . అతనితో వేగలేకపోతున్నాను నావల్ల కాదు అంటూ చెప్పే డైలాగ్ హైలెట్గా మారింది . సరదాగా ఇంట్లో భార్యాభర్తల మధ్య వచ్చే ప్రతి గొడవలు చాలా క్లియర్ గా చూపించారు డైరెక్టర్ . అంతేకాదు ఎమోషనల్ గా కూడా కట్టిపడేసాడు . ఎంత ప్రేమ పెంచుకున్న దగ్గరవుతాం కానీ సొంతం కాలేము కదా అనే డైలాగ్ కృతి శెట్టి చెప్పడం చాలా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. ప్రెసెంట్ ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమా జూన్ 7వ తేదీ గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అందుకుంటుంది అంటున్నారు ఫ్యాన్స్..!!