పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చి సినిమా స్కేడ్యుల్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. రాజకీయ వ్యవహారాలు వల్ల హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ ఎంతో కాలం నుంచి బ్రేక్ పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ షూటింగ్స్ అన్ని పట్టాలెక్కనున్నాయని సమాచారం. అయితే వీటిలో ఏది ముందుగా సెట్స్‌పైకి రానుంది.. ఏది ముందుగా రిలీజ్ కానుంది.. అనేది నెటింట చర్చనీయాంశంగా మారింది.
సెప్టెంబర్ లో ఓజి ని రిలీజ్ చేస్తామంటూ మేకర్సట్ గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ ముందుగా భోజి షూటింగ్లో పాల్గొంటారని అంతా భావించారు. అయితే హరిహర వీరమల్లు సినిమా మొదలుపెట్టి చాలా కాలం అయిపోయిందని.. దాని వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఓజీకి బ్రేక్ ఇచ్చి హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడట పవన్. దీంతో ఓజి సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని.. జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్ తర్వాత హరిహర వీరమల్లు మూవీ కాల్ షీట్ పై పవన్ క్లారిటీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది.
దీనికి తగ్గట్టు మేకర్స్ సిద్ధంగా ఉండాలని ఆయన వివరించారట. జూన్ నెలలో వీరమల్లు షూటింగ్ ప్రారంభం కానుందని.. సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని కాస్త పోస్ట్ పన్ చేసి డిసెంబర్లో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరమల్లు ఎప్పుడు వస్తాడో వేచి చూడాలి. ఇక ఇటీవల హరి హర వీరమల్లు టీజర్ రిలీజ్ ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంది.