సౌత్ స్టార్ బ్యూటీ త్రిష పోనియన్ సెల్వన్, లియో సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటూ మంచి ఫామ్ లో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. చిరంజీవి, కమల్ హాసన్, మోహన్లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలను కూడా సైన్ చేసిన ఈ అమ్మడు.. ఈ నేపథ్యంలో నయనతార నటించిన సినిమా సీక్వెల్‌లో ఛాన్స్ కొట్టేసింది. తమిళ్ కమెడియన్ ఆర్జే బాలాజీ డైరెక్షన్లో నయనతార హీరోయిన్గా తెరకెక్కిన సోషియా ఫాంటసీ మూవీ అమ్మోరు తల్లి.. 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో సీక్వెల్ పనులు కూడా బిజీబిజీగా జరుగుతున్నాయి. కాగా ఈ సిక్వెల్‌లో త్రిషాని లీడ్ రోల్‌లో తీసుకోవాలని ప్లాన్ చేశారట మేకర్స్. ప్రస్తుతం ప్రీ షూట్ పనులు వేగంగా జరుగుతున్నాయట. త్వరలోనే ఈ సినిమా పనులు పూర్తి చేసి సెట్స్ పైకి రానుందని టాక్ వినిపిస్తుంది. త్రిష కేవలం ఈ సినిమా మాత్రమే కాదు నయన్ చేయాల్సిన చాలా ప్రాజెక్ట్స్ ని ఇప్పటికే తన ఖాతాలో వేసేసుకుంది.
పొనియన్ సెల్వన్, లియో హిట్స్ పడకుంటే చిరంజీవి, కమలహాసన్, మోహన్‌లాల్, అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కచ్చితంగా ఛాన్స్ నయనతారకే వచ్చిండేది అనడంలో అతిశయోక్తి లేదు. కానీ త్రిష రియంట్రీ తో మంచి ఫామ్ లో దూసుకుపోతుంది. దీంతో నయన్‌కు కాస్త మైనస్ అయిందని చెప్పాలి. ప్రస్తుతం త్రిష.. చిరు విశ్వంభర, కమల్ హాసన్.. తగ్ లైఫ్, మోహన్‌లాల్ రామ్, అజిత్ విడమయూర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.