ఆ ఒక్క తప్పే .. ఎక్స్ ట్రా జబర్ధస్త్ క్లోజ్ చేయడానికి కారణమా..?

అతి చేస్తే ఎప్పటికైనా ప్రమాదమే ..అది అందరికీ తెలిసిందే .. టైం బాగున్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి .. టైం బాగోలేనప్పుడు మంచి మాట్లాడిన అది చెడుగా ఉంటుంది. ఈ విషయం మన ఇంట్లోని పెద్దవాళ్ళు మనకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు . అయితే ఇప్పుడు అదే సామెత ను జబర్దస్త్ కి అప్లికేబుల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. జబర్దస్త్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక కామెడీ షో స్టార్టింగ్ లో మాత్రం నిజంగానే కామెడీ షో ..ఆ తర్వాత మాత్రం వల్గర్ షో గా మారిపోయింది . అమ్మాయిలు పై డబల్ మీనింగ్ డైలాగ్స్ బూతు పదాలను వాడుతూ అమ్మాయిల పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం ఎక్కువగా జరిగాయి .

కొందరు ఆ బాడీ షేమింగ్ కామెంట్స్ కు తట్టుకోలేక షో నుంచి బయటికి కూడా తప్పుకున్నారు . కాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో త్వరలోనే క్లోజ్ చేయనున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ షో నుంచి ఇంద్రజను తొలగించారు. అంతేకాదు త్వరలోనే సిరి, స్కిట్ బాగా చేయని పలువురు కమెడియన్స్ కూడా తొలగించనున్నారు అని టాక్ వైరల్ గా మారింది. అయితే సడన్ గా ఎందుకు ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ షో ఆపేస్తున్నారు అనే విషయం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 2013లో స్టార్ట్ అయిన జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అందరికీ తెలుసు.

అయితే షోలో వల్గారిటీ ఎక్కువ అయిపోతుంది అని 20-20 నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటూ వచ్చారు . కాగా క్రేజీ క్రేజీ స్టార్స్ షో నుంచి తప్పుకోవడంతో టిఆర్పి రేటింగ్స్ పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే నష్ట నివారణ చర్యలో భాగంగా మల్లెమాల షోను తీసేయాలి అని ఉన్న వాటిలో బెస్ట్ టీం తో కామెడీ పండించే విధంగా ప్లాన్ చేయాలి అని భావిస్తుందట . ఆ క్రమంగానే జూన్ నుంచి ఇంప్లిమెంట్ చేసే విధంగా జబర్దస్త్ షో ఒక్కటే గురువారం, శుక్రవారం లో టెలికాస్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసిందట. అయితే షోలో వల్గర్ కంటెంట్ పచ్చి బూతు పదాలు పరోక్షకంగా అమ్మాయిలను హర్ట్ చేయడమే ఈ షో టిఆర్పిస్ తగ్గడానికి కారణం అంటున్నారు జనాలు..!!