నాగార్జున .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇప్పుడు సీనియర్ హీరోగా మారాడు . నిన్న మొన్నటి వరకు నాగార్జున పేరుని బాగా ట్రోల్ చేశారు జనాలు. దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే . కొడుకులు లైఫ్ లో సెటిల్ కాలేకపోయారని ..కొందరు కోడళ్లు వదిలేసి వెళ్లిపోయారని మరికొందరు అసలు మీ ఇంట్లో మనవడు మనవరాలు వచ్చే అదృష్టమే లేదు అని.. మరికొందరు రకాలుగా టార్చర్ చేశారు . మెంటల్ ప్రెజర్ పెంచేశారు . కానీ నాగార్జున అవి ఏవి పట్టించుకోలేదు.. తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోయాడు.
కాగా ఫైనల్లీ సినిమాలలో తన పాత్ర పై కాన్సన్ట్రేషన్ చేయడం ప్రారంభించాడు . శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఇంపార్టెంట్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు నాగార్జున . కుబేర అనే సినిమాలో నాగార్జున ట్రెండ్ సెట్టర్ పాత్రను చేయబోతున్నారు . దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియోని రిలీజ్ చేశాడు శేఖర్ కమ్ముల . ఆ వీడియో ఎంత హైలెట్గా మారిందో అందరికీ తెలిసిందే . కాగా శేఖర్ కమ్ముల ఈ పాత్రను ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరో క్యారెక్టర్ ని బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్నారట .
సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరో కోట్లకి కోట్ల ఆస్తి ఉంది. కానీ రూపాయి కూడా ఖర్చు పెట్టడు.. తన డప్పు తానే కొట్టుకోవడానికి మాత్రం కోట్లు ఖర్చు పెడతాడు. అలాంటి ఓ క్యారెక్టర్ని జనాలకు తెలియజేసే విధంగా శేఖర్ కమ్ముల ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ని డిజైన్ చేశారట. దీనికి సంబంధించిన న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు . చాలా రియల్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ములా అంటూ కూడా ప్రచారం జరుగుతుంది..!!