‘మిస్టర్ బచ్చన్’ షో రీల్ స్పెషల్ గ్లింప్స్ చూశారా.. ఒక్కొక్కడికి రవితేజ పోయించేలాగే ఉన్నాడే (వీడియో)..!

రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మాస్ మహారాజా రవితేజ నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతుంది . ఎంతో ఎంతో స్పెషల్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటున్నా సరే ఆ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ప్రేక్షక ఆదరణ పొందడం లేదు . ఫ్యాన్స్ కి నచ్చుతున్న కానీ మిగతా జనాలకు నచ్చలేక పోతుంది . దీంతో సినిమా డిజాస్టర్ టాక్ దక్కించుకుంటూ వస్తుంది . అయితే రవితేజ ఈజ్ బ్యాక్ అనేలా తన పాత సినిమా రికార్డులను తానే బద్దలు కొట్టుకునేలా మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు రవితేజ .

ఆ సినిమాకి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ కూడా పెట్టారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ రిలీజ్ అయినా.. ఏ న్యూస్ లీకైన ఫ్యాన్స్ మాత్రం బాగా ఆకట్టుకుంటూ వచ్చింది . కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి స్పెషల్ షో రీల్ వీడియో రూపంలో రిలీజ్ చేశారు . ఆ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . ఒక్కటంటే ఒక్క డైలాగ్ ఈ వీడియోలో లేదు కానీ రవితేజ యాక్షన్ సీన్స్ మాత్రం అదరగొట్టేసాయి దుమ్ము దులిపేసాయి .

పక్కాగా చెప్పాలి అంటే ఇడియట్ సినిమాలో మనం ఏ రవితేజానైతే చూసామో అదే రవితేజ ఈ మిస్టర్ బచ్చన్ సినిమాలో కనిపించబోతున్నాడు . మరీ ముఖ్యంగా ఆయన పర్ఫామెన్స్ ఆయన సిగరెట్ తాగే విధానం విలన్తో ఫైట్ చేసే విధానం చాలా డిఫరెంట్గా తెరకెక్కించాడు హరీష్ శంకర్ అనే చెప్పాలి . రిలీజ్ అయిన స్పెషల్ గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఎవరైతే రవితేజ ఇక ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పచ్చు అని ట్రోల్ చేశారో వాళ్లకి ప్యాంట్ తడిసిపోయేలాగే ఈ గ్లింస్ ను కట్ చేశాడు హరీష్ శంకర్ అంటున్నారు జనాలు . మొత్తానికి చాలా కాలం తర్వాత రవితేజ తన ఖాతాలో హిట్ వేసుకోబోయే లానే ఉన్నాడు. చూద్దాం మరి సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో..??

 

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA (@raviteja_2628)