చరణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. ఆర్ సి 17 కోసం మొదటిసారి అలాంటి పని చేస్తున్న చరణ్..?!

టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో సినిమా ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవాలని ఉద్దేశంతో శంకర్ సినిమాను చాలా కేర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నాడట. అందుకే సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ని కూడా ఇంకా అనౌన్స్ చేయలేదని తెలుస్తుంది.

Ram Charan requests his fans to put pressure on director Sukumar to name  their film | Telugu Movie News - Times of India

ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేయాలి అనేదానిపై శంకర్‌కు కూడా క్లారిటీ లేదని.. మొత్తానికి ఈ సినిమాతో అటు రామ్ చరణ్, ఇటు శంక‌ర్‌ ఇద్దరు భారీ సక్సెస్ అందుకునేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో తన 16వ సినిమా నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన సుకుమార్ డైరెక్షన్లో ఆర్‌సీ17 కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Ram Charan says Uma Maheshwara Ugra Roopasya is the one film he absolutely  loved; reveals why

ఇక‌ భారీ యాక్షన్ ఫిల్మ్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. పాన్ ఇండియా లెవెల్లో రూపొందించే ఈ సినిమా కోసం చ‌ర‌ణ్ ఎప్పుడు న‌టించ‌ని కొత్త పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. చరణ్ మొద‌టి సారి ఆర్ సీ 17 కోసం కౌబాయ్ గా కనిపించబోతున్నాడట. ఇప్పటివరకు రామ్ చరణ్ అలాంటి పాత్ర‌లో న‌టించ‌లేదు. దీంతో ఈ సినిమాల్లో రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో.. ఎలాంటి కథతో చరణ్ వస్తున్నాడో అనే అంశంపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి మొద‌లైంది. ఇక వీరిద్ద‌రి కాంబోలో రానున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.