ఆ వీడియో మ్యాటర్ లో జర్నలిస్టుపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన హీరోయిన్..?!

బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్‌.. ఇటీవ‌ల‌ తన డ్రైవర్ పై కొందరు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక స్వతంత్ర జర్నలిస్ట్ మొహ్సిన్ షేక్ పై పరువు నష్టం దాబా కేస్ వేసి.. నోటీసులు పంపించింది. ఇదే విషయాన్ని రవినా తరపు న్యాయవాది సనా రాయీస్ ఖాన్‌ వివరించారు. ఇటీవల రవినాను తప్పుడు ఫిర్యాదుతో ఇరికించే ప్రయత్నం చేశారని ఆమె చెప్పుకొచ్చింది. కొద్దిరోజుల క్రితం రవీనాకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ పేరుతో మొహ్సిన్ షేక్ సోషల్ మీడియా వేదికపై షేర్ చేశాడు. ఆ వీడియోలో తమపై దాడి చేయకండి అంటూ ఒకరు విజ్ఞప్తి చేస్తున్నట్లు చూపించాడు. అందులో ఉన్నది రవీనా టాండన్ అని.. మద్యం సేవించి డ్రైవర్ తో పాటు ఆమె జర్నీ చేస్తుందని ఆ విడియోతో ఆయ‌న చెప్పుకొచ్చాడు.

Please Don't Hit Me': Raveena Tandon ATTACKED In Mumbai After Being Accused  Of Rash Driving, Assaulting 3 Women - Shocking Video Viral

ర్యాష్ డ్రైవింగ్‌కు వారు పాల్పడడం వల్ల ఆ టైంలో ముగ్గురు గాయపడ్డారని.. దీంతో వారి బంధువులు వచ్చి రావీనా టాండన్ పై దాడి చేశారంటూ అందులో రాసుకొచ్చాడు. ఆ టైంలో తన పై దాడి చేయకండి అంటూ ఆమె వేడుకున్నట్లు వీడియోలో ఉందని వెల్లడించాడు. దీనిపై స్పందించిన ముంబై పోలీసులు తాజాగా క్లారిటీ ఇచ్చారు. అది తప్పుడు వార్త‌ అని.. రవీనా మద్యం తాగలేదు అంటూ పోలీసులు వివరించారు. ఫిర్యాదుదారులు తప్పుడు కేసు పెట్టారని.. ఆయన చెప్పుకొచ్చాడు. రవీనా కారును పార్క్ చేసేందుకు డ్రైవర్ రివర్స్ చేస్తున్న క్రమంలో కుటుంబం నడుచుకుంటూ అటుగా వెళుతోందని.. కారు వారి దగ్గరకు వెళ్లడంతో డ్రైవర్‌తో వారు గొడవ పెట్టుకున్నారని.. అది కాస్త పెద్దగా మారడంతో ర‌వీనా అక్కడికి చేరుకొని వారి నుంచి డ్రైవర్‌ను రక్షించే ప్రయత్నంలో వాళ్లతో వాగ్వాదానికి దిగిందని తెలుస్తుంది.

Raveena Tandon sues man for Rs 100 crore for defamatory video - India Today

దీంతో ఆమెపై కూడా వారు గొడవకు వచ్చారని.. అంత‌టితో ఆగ‌కుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారని సమాచారం. అయితే దీనిని సోషల్ మీడియాలో ఆ జర్నలిస్టు మాత్రం ర‌వీనాని కొట్టారంటూ.. మద్యం సేవించి కారు నడిపిందంటూ.. తప్పుడు వేలో చూపించాడని పోలీసులు వివరించారు. ఆ ఘటన అంత సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిందని.. రవీనా కానీ, తన డ్రైవర్ కానీ మద్యం సేవించలేదని వారిపై తప్పుడు ఆరోపణలు చేశారని.. ముంబై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇక పోలీసులు విడుదల చేసిన స్టేట్మెంట్‌తో తనపై తప్పుడు ప్రచారం చేసిన స్వతంత్ర జర్నలిస్ట్ మోహ్సిన్ పై రూ.100 కోట్ల పరువు నష్టం దాబా వేసి లాయర్ స‌న్నా ఖాన్ ద్వారా అతనికి నోటీసులు పంపింది.