‘ మనం ‘ మూవీ సమంతతో శోభనం సీన్ చూసిన చైతన్య.. రియాక్షన్ ఇదే(వీడియో)..?!

టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండిగ్‌గా మారిన‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ అంతా ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన‌ మూవీ మ‌నం ను తాజాగా రీ రిలీజ్ చేశారు. మనం మూవీని చూసేందుకు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తో పాటు.. నాగచైతన్య థియేటర్ కు వెళ్లి సందడి చేశారు. ఈ క్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హీరోయిన్ సమంతతో శోభనం సీన్ రాగానే నాగచైతన్య రియాక్ట్ అయిన తీరు ప్రస్తుతం వైరల్ గా మారింది. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

Manam (film) - Wikipedia

మూడు తరాల హీరోలు ఈ సినిమాలో నటించి మెప్పించారు. ఏఎన్ఆర్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ నటించిన ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీ మూవీ గా అక‌ట్టుకుంది. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో విక్రమ్ కుమార్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో సమంత హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, సమంత భార్య భర్తలుగా.. లవర్స్ గా రెండు భిన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు.

Viral Video: సమంతతో శోభనం సీన్ చూసిన నాగ చైతన్య షాకింగ్ రియాక్షన్, వీడియో వైరల్!

మనం మూవీ రీ రిలీజ్‌కు హాజరైన చైతన్య.. ఈ మూవీలో సమంతతో శోభనం సీన్ జరుగుతున్న క్రమంలో అభిమానులు అరుస్తూ రచ్చ చేయడంతో.. ఒక్కింత అసహనం ఫీలయ్యాడు. కోపాన్ని చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 2021లో ఈ జంట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వీరిద్దరూ విడిపోవడానికి కారణాలు ఇవ్వేనంటూ ఎన్నో పుకార్లు వినిపంచాయి. కానీ ఇప్పటివరకు చైతన్య కాని స‌మంతా కానీ వారి విడాకులకు కారణం ఏంటనేది బయటకు చెప్పలేదు. ఇక ప్రస్తుతం ఇద్దరు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.