వావ్.. అనన్య నాగళ్ళలో ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా.. మన తెలుగు అమ్మాయి అదరగొడుతుందిగా (వీడియో)..!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల టాలెంట్ కు మంచి గుర్తింపు వస్తుంది. ఈ జనరేషన్లో టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. బేబీతో హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మరో తెలుగు బ్యూటీ అనన్య నాగళ‌ ఇండస్ట్రీలో తనకంటూ మంచి క్రేజ్‌ సొంత చేసుకుంది. మ‌ల్లేశంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తర్వాత వకీల్ సాబ్లో నటించి ప్రశంసలు అందుకుంది.

హీరోయిన్గా ఆఫర్స్ కోసం వెయిట్ చేయకుండా వచ్చిన మంచి అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.తాజాగా తంత్ర మూవీ తో మరో సక్సెస్ అందుకున్న అనన్య.. ఈ క్రమంలో తన నటనకు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఓవైపు వరస సినిమాలతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. నిత్యం ఏదో ఒక ఫోటోషూట్ వీడియో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక గత కొంతకాలంగా గ్లామర్ ఫోటోస్ తో ప్రేక్షకులకు ట్రీట్ ఇస్తుంది ఈ చిన్నది.

తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన వారంతా అనన్యాలో ఉన్న స్పెషల్ టాలెంట్ కు షాక్ అవుతున్నారు. ఈమె ఈ వీడియోలో కర్ర సాము ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించింది. ఏదో సినిమా కోసం కర్ర సామును నేర్చుకుంటున్నట్లు ఈ విడియో అనిపించింది. ఇక‌ ఈ అమ్మడు కర్ర సాము విడియో చూసిన వారంతా బాగా చేస్తుందే అంటూ సూప‌ర్ టాలెంట్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ananya nagalla (@ananya.nagalla)