ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ రీమిక్ కు సిద్ధమైన ఆ యంగ్ హీరో.. అతడికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్న తారక్..?!

తెలుగు ఆడియన్స్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలు ఆయన సాధించిన సక్సెస్‌లే అయ‌న‌కి పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ అందుకొని స్టార్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నాడు తారక్. ఇలాంటి క్రమంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్నా యంగ్ హీరో ఒకరు తారక్ సినిమాను రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Vishwak Sen (@vishwaksens) • Instagram photos and videos

ఇంతకీ అతను ఎవరో.. అస‌లు మ్యాట‌ర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆ యంగ్‌ హీరో మరెవరో కాదు విశ్వక్‌సేన్. ఈయన వరుస‌గా మంచి సినిమాలు నటిస్తూ సక్సెస్‌లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. విశ్వక్‌సేన్ ఎన్టీఆర్‌కు డై హార్ట్‌ ఫ్యాన్.. కనుక జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని క్లాసికల్ సినిమాలను విశ్వక్ రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. వాటిలో ఎన్టీఆర్ నటించిన నా అల్లుడు మూవీ ఒకటి. అయితే ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ విశ్వక్ ఇదే కథను కొద్దిగా కరెక్షన్స్ చేసి తెరకెక్కిస్తే ఖచ్చితంగా సక్సెస్ అందుతుందని భావిస‌క‌తున్నాడ‌ట‌.

Naa Alludu - Wikipedia

కనుక తారక్ నటించిన సినిమాలన్నింటిలో నా అల్లుడు సినిమాని రీమిక్ చేయాలనుకుంటున‌ట్లు ఓ షో లో వివరించాడు. దీంతో విశ్వక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ కూడా విశ్వక్ ఎంకరేజ్ చేయడానికి చాలా వరకు ఆయన సినిమా ఫంక్షన్స్ కు, ప్రమోషన్స్ కు హాజరై సందడి చేస్తున్న సంగతి తెలిసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో సినిమాల ప్రమోషన్స్ ఈవెంట్లలో సందడి చేశాడు తారక్. దీనిబట్టి తారక్‌, విశ్వక్ మధ్య ఉన్న బాండింగ్ ఏంటో ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఈ బాండింగ్ తోనే విశ్వక్ త‌న‌ సినిమాల‌కు రీమేక్ నటించిన తారక్ ఫుల్ సపోర్ట్ ఉంటుందని.. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.