అప్పుడు రూ.500 కోసం హోటల్లో హోస్ట్ గా.. ఇప్పుడు సినిమాకి రూ.4 కోట్లు.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు సౌత్ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు వరుస‌ సినిమాలో నటిస్తూ స్టార్ బ్యూటీగా మారిన ఈ అమ్మడు.. ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వచ్చింది. ఉన్నత చదువులు.. జీవితంలో స్థిరప‌డాలని ఆశయం ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువు మధ్యలో ఆపేసిన ఈ ముద్దుగుమ్మ.. కుటుంబానికి అండగా నిలిచినందుకు మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

Samantha Akkineni: 6 rare photos of the Oh! Baby actress you've probably  never seen before

ఇప్పుడు ఎంతోమంది చిన్నారులకు అండగా నిలుస్తూ ప్ర‌శంస‌లు అందుకుంటుంది. సౌత్ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఎలాస్తున్నా.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకలు ఎదుర్కొంటుంది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం సాధారణ విషయం కాదు. కాగా ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోయిన్గా క్రేజ్ ను సంపాదించుకొని దూసుకుపోతుంది.

Samantha Latest Hot Photos

ఇంత‌కి ఈ చిన్నది ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత. దేశంలోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను సంపాదించుకుని.. నటిగా రికార్డ్ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానం దక్కించుకున్న ఈ అమ్మడు.. కాలేజీ రోజుల్లోనే 500 కోసం హోటల్ ఈవెంట్ హోస్ట్ గా పని చేసిందట. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు నాలుగు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న శ్యామ్ తన సినీ కెరీర్ లో రూ.101 కోట్ల ఆస్తిని సంపాదించిందని టాక్. అయితే గతంలో మాత్రం కేవలం రూ.500 కోసం హోటల్లో హోస్ట్ గా పని చేసింద‌ని తెలియ‌టంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.