హీరో వేణు పై కేసు నమోదు.. కారణం ఇదే..?!

ఒకప్పటి తెలుగు హీరో తొటెంపూడి వెణుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు సినిమాలతో మంచి సక్సెస్ అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వేణు.. త‌ర్వాత సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యాడు. ఇక‌ తాజాగా ఈ హీరో పై ఓ లీగల్ కేసు నమోదు అయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఫ్యామిలీ మెంబర్స్ నిర్వాహ‌కులుగా ర‌న్ చేస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకులు, సినీ నటుడు తొట్టెంపూడి వేణు తో పాటు ఆ సంస్థ ఏండి పై కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఓ ప్రాజెక్టుకు సంబంధించిన పనిని తెహ్రి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ సొంతం చేసుకుంది.

Venu Thottempudi was offered a role in Athadu

ఇక ఈ పనిని బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్ సంస్థ, స్వాతి కన్స్ట్రక్షన్ సంస్థలకు.. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నుండి సబ్ కాంట్రాక్టుకు ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్స్ సంబంధించి స్వాతి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆ పని నుండి తప్పుకుంది. ఈ ప్రాజెక్ట్ 2002లో పనులు మొదలుపెట్టి వారు చేసిన పనులు రూ.450 కోట్లను టిఎస్టిసి అందించింది. అయితే అందులో 5.5% ప్రభుత్వ కన్స్ట్రక్షన్ తీసుకుని.. మిగిలిన 94% ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ రిత్విక్ కన్స్ట్రక్షన్ ఖాతాలో వేశారు. ఆ తర్వాత ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కి, తెహ్రి డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మధ్య ఏర్పడిన వివాదాలతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మిగిలిన పనులకు రూ.1010 కోట్ల రిలీజ్ కాగా.. ఆ డబ్బు తెహ్రి డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జమ చేసుకుంది.

Happy birthday Venu Thottempudi: Did you know the reason behind his long  absence from films? | Telugu Movie News - Times of India

ఇందులో కూడా ఒప్పందం ప్రకారం వాటాలు తీసుకోవాల్సి ఉండగా.. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధి మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కరరావు, సినీ నటుడు తొట్టెంపూడి వేణు, మరో ప్రతినిధి అలాగే కావూరి భాస్కరరావు తల్లి, పిసిఎల్ సంస్థ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్.. రిత్విక్ ప్రాజెక్ట్తో చేసుకున్న ఒప్పందం హక్కులను రద్దు చేసుకున్నారు. దీంతో వారు ఉద్దేశపూర్వకంగా మోసం చేసి మొత్తం డబ్బులు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులపై రిత్విక్ ప్రాజెక్ట్స్ అధ్యక్షుడు టి రవికృష్ణ బంజర హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీంతో మొత్తం ఐదుగురిపై సెక్షన్ 406,420,506 రెడ్విత్ 34 స్పెషల్ కింద కేసులు నమోదు చేసి ఎంక్వయిరీ మొదలుపెట్టారు.