అత‌నికి అస‌లు సిగ్గులేదు.. బట్టలు లేకుండా వచ్చి నా పక్కన కూర్చుంటాడు.. స్టార్ హీరోపై హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్..?!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ ఒంటిపై నులుపోగు కూడా లేకుండా ఫోటోషూట్ చేసి.. రెండువేల క్రితం చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఓ మ్యాగజైన్ కోసం ఆయన నగ్నంగా దిగిన ఫొటోస్ నెటింట తెగ వైరల్ అయ్యాయి. అయితే అదంతా ఆయన ఓ యాడ్ కోసం చేసుంటాడని అంతా భావించారు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణ్‌వీర్‌ సింగ్ దుస్తుల గురించి బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో అంతా షాక్ అవుతున్నారు. రణ్‌వీర్ సింగ్, పరిణితి చోప్రా ఇద్దరం మొదటి నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి లేడీస్ వర్సెస్ రెక్కీ బాహ్లే అనే సినిమాను నటించారు. పరిణితికి ఇదే మొదటి సినిమా. అలాగే వీరిద్దరూ కలిసి బ్యాండ్ బాజా భారత్ అనే సినిమాలను ముప్పించారు.

ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్యా మంచి స్నేహం ఏర్ప‌డింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరిణితి మాట్లాడుతూ రణ్‌వీర్‌ సింగ్ ఒంటిపై దుస్తులు కూడా ఉంచుకోడు అంటూ షాక్ ఇచ్చింది. రణ్‌వీర్‌తో నాకు ఉన్న స్నేహాన్ని బట్టి అతను చేసే పనులు కూడా అలవాటైపోయాయి. ఒక్కొక్క రోజు ఒక్కో డిజైన్ దుస్తులను వేసుకొచ్చి ఈ రోజు ఇదే లుక్ అంటూ ఉంటాడు. ఒక్కోసారి ప్యాంట్‌ కూడా వేసుకోకుండా వచ్చి నా పక్కన కూర్చుంటాడు. అబ్బా ప్యాంట్‌ వేసుకోవచ్చు కదా అని ఎవరైనా చెప్తే అప్పుడు వెళ్లి ప్యాంట్‌ వేసుకొని వస్తాడు. నేను సాధారణంగా ఇతరుల మేకప్ వ్యాన్ లోకి వెళ్ళిపోతా. కానీ రణ్‌వీర్ ఉన్న రూమ్‌కి వెళ్లడానికి మాత్రం ఆలోచిస్తా. అతని పర్మిషన్ తీసుకునే దానిలోకి అడుగుపెడతా.

Ranveer Singh's Nude Photoshoot Images Go Viral | Read Scoops

దానికి కూడా కారణం ఉంది. తను నిద్రపోతున్నాడు, లేదా వాష్ రూమ్ లో ఉంటాడని ఉద్దేశంతో అలా చేయను. బట్టలు ఉన్నాయో లేదో అని తెలుసుకుని వెళ్తా. ఒక్కోసారి లోపలికి రావచ్చా అంటే రావచ్చని చెప్తాడు. కానీ బట్టలు లేకుండా ఎదురుగా నిలబడతాడు. అప్పుడు కూడా దుస్తులు వేసుకోడు.. అలాగే సమాధానం ఇస్తాడు అంటూ పరిమితి సెట్లో రణ్‌వీర్ తో ఉన్న ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకుంది. బట్టలు లేకుండా అతనిని చూస్తే అతను ఏమాత్రం ఫీల్ అవ్వడనీ.. ఆ టైంలో మనమే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అలా బట్టల్లేకుండా ఎందుకు తిరుగుతావు అని అడిగితే తనని అలా చూడడం వల్ల ఇతరుల జీవితంలో ఎలాంటి మార్పులు ఉండవని అలాంటప్పుడు ఎందుకు అంత బాధ పడడం అని సమాధానం ఇస్తాడని వివ‌రించింది.

Kill Dil: Parineeti Chopra and Ranveer Singh bonding big time? | India.com

ఒక్కసారి రొమాంటిక్ సీన్ కోసం రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ వెనక్కి తిరిగేసరికి.. ప్యాంట్ లేకుండా రణ్‌వీర్ సెట్ లో ఉన్నాడని వివరించింది. ఇలాంటి సీన్ లో నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.. స్క్రిప్ట్ లో ఉన్నట్టు కనిపించాలి అంటూ చెప్పానని.. దాంతో ప్యాంటు వేసుకొని వచ్చాడు అంటూ చెప్పుకొచ్చింది. ఆయన రూమ్ లోకి వెళ్లిన ప్రతిసారి బట్టలు లేకుండానే కనిపిస్తాడు. నా ముందే కాదు తను పబ్లిక్ లోనే ప్యాంట్ తీసేయగలడు. ఇదంతా తనకు పెద్ద మ్యాటర్ కాదు అంటూ చెప్పుకొచ్చింది. మా మధ్య ఉన్న బాండ్‌, చనువుతోనే ఇవన్నీ చెబుతున్నట్లు ఆమె వివరించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు అత‌ను పెద్దగా పట్టించుకోడని ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక తాజాగా పరిణితి చోప్రా.. అమర్ సింగ్ చంకీల సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది.