తారక్ ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్.. ‘ వార్2 ‘ లో ఎన్టీఆర్ తమ్ముడిగా ఆ కన్నడ స్టార్ హీరో..?!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టార‌ర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఆర్ఎఫ్‌ స్పై సినిమాటిక్ యూనివర్సలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మెయిన్ లీడ్‌గా ఎన్టీఆర్ రా ఏజెంట్గా ఓ కీల‌క‌ పాత్రలో న‌టిస్తున్నార‌ట‌. కాగా ఈ మూవీలో మరో ముఖ్యపాత్ర కూడా ఉంద‌ని.. ఆ పాత్ర ఎన్టీఆర్ తమ్ముడు రోల్ అని తెలుస్తుంది.

Celebrity profiles: Kannada actor Dhruva Sarja (ಧ್ರುವ ಸರ್ಜಾ)movies, photos, Dhruva Sarja movies list, biography, family photo

ఇక ఆ రోల్‌ కోసం కూడా మరో స్టార్ హీరోని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ స్టార్ హీరో దృవ్ సర్జా, ఎన్టీఆర్ కి తమ్ముడు గా కనిపించబోతున్నాడట. అయితే ఈ సినిమాలో ఆ పాత్రకు చాలా తక్కువ నడివి ఉంటుందని టాక్‌. ఎన్టీఆర్ తమ్ముడు గా నటించిన హీరో చనిపోయిన తరువాత ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని.. తమ్ముడు కోసం ఎన్టీఆర్ ఏం చేశాడు.. అనేది మిగతా స్టోరీ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో సౌత్ హీరో ఎంట్రీ ఇచ్చాడని వార్తలు వైరల్ అవ్వడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. వార్ 1 తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో యాక్షన్ పోర్షన్ కూడా వేరే లెవెల్ లో ఉండబోతుందట.

Release date locked for NTR, Hrithik Roshan multistarrer 'War 2'

ముఖ్యంగా ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయని టాక్‌. ఆడియన్స్‌కు గూస్ బంప్స్ వ‌చ్చే విధంగా ఈ ఫైట్ సీన్స్ ప్లాన్ చేశార‌ట మేక‌ర్స్‌. ఈ క్రమంలో మార్బల్ మూవీ స్టంట్ మాస్టర్ స్పిరో రజాటోస్ ను సినిమా కోసం తీసుకువచ్చారని టాక్. ఇక జాన్ అబ్రహం ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. కీయీరా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా కనిపించనున్నారు. వచ్చేయడాది ఆగస్టు 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.