అల్లు అర్జున్ పెట్టుకున్న ఈ వాచ్ అంత స్పెషలా..? కాస్ట్ ఎంతో తెలిస్తే బుర్ర గిర్రున తిరిగిపోద్ది..!!

స్టైలిష్ స్టార్ అన్న బిరుదు ఊరికే ఇచ్చేస్తారా ..?ఆ స్టైల్ ను ఫాలో అవ్వాలి ..అలాంటి స్టైలిష్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉండాలి.. అప్పుడే ఆ స్టైలిష్ స్టార్ అన్న బిరుదుకు ఒక అర్థం . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు మారుమ్రోగిపోతుంది . పుష్ప సినిమా కారణంగా పాన్ ఇండియా లెవెల్ లో ఆయన పేరు ఏదో ఒక కారణంగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . కాగా తాజాగా స్టైలిష్ స్టార్ ధరించిన వాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో మరీ మరీ వైరల్ గా మారాయి .

అల్లు అర్జున్కి వాచెస్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాస్ట్ బట్టి కాకుండా ఆ వాచ్ లోని ఫీచర్స్ స్పెషాలిటీస్ బట్టి ఆ వాచ్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు . తాజాగా ఓ వేడుకల్లో బన్నీ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో ఇది ఫ్యాషన్ గా మారిపోయింది . ఈ క్రమంలోనే బన్నీ ధరించిన వాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి . బన్నీ ధరించిన వాచ్ కాస్ట్ ₹3,97,431 అని తెలుస్తుంది. ఇది బన్ని దగ్గర ఉన్న అన్ని వాచెస్ లోకి చాలా చాలా స్పెషల్ వాచ్ అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఈ వాచ్ స్పెషాలిటీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి .

బన్నీ ఎంతో ఇష్టంగా ఆశపడి ఈ వాచ్ ని కొనుగోలు చేశారట. చాలా స్టైలిష్ లుక్ లో బన్నీ ఈ వాచ్ లో మెరిసిపోవడం అభిమానులకి మరింత ఆకర్షణీయంగా కనిపించింది . చాలా ముద్దుగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ప్రజెంట్ బన్నీ వాచ్ డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా ఈ సినిమాలో కనిపించబోతున్నారు . ఈ సినిమాలో హాట్ ఐటమ్ సాంగ్ కోసం అనిమల్ బ్యూటీ తృప్తి సెలెక్ట్ అయినట్లు వైరల్ గా మారింది..!!