పవర్ స్టార్ కు భారీ షాక్ ఇచ్చిన బన్నీ, ప్రభాస్ అభిమానులు.. ఏం చేశారంటే..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎంతో యాక్టివ్‌గా పాలిటిక్స్ లో కొనసాగుతున్న పవన్.. ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేయనున్నాడు. అతి తక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేయడం గురించి పవన్ ఫ్యాన్స్ నుంచి భారీ నెగెటివిటీ వస్తోంది. అందులోనూ ఈ 21 స్థానాల్లో కొన్ని స్థానాలకు అసలు జనసేనకు పెద్దగా బలం కూడా లేని స్థానాలు దక్కాయి. దీనికి తోడు గాజువాకలో బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్ వైసీపీలో చేరడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Actor-Politician Pawan Kalyan Gets Andhra Women's Panel Notice Over His Human Trafficking Claim

సాధారణంగా ప్రభాస్ ఫాన్స్ బీజేపీ, బన్నీ ఫాన్స్ జనసేనకు మద్దతుగా ఇస్తారని జనం భావిస్తూ ఉంటారు. అయితే కూటమిలో ఉన్న నేతలకు షాక్ ఇచ్చే విధంగా ఇప్పుడు ఫ్యాన్స్ నిర్ణయాలు తీసుకున్నారట. ప్రస్తుతం బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్ గాజువాక వైసీపీకి అనుకూలంగా నిలిచారని.. దీంతో వైసీపీకే అనుకూల ఫలితాలు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ ఆధ్వర్యంలో గాజువాక అభివృద్ధి చెందుతుందని భావనతో బన్నీ, డార్లింగ్ ఫ్యాన్స్ వైసీపీలో చేరినట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Gudivada Amarnath: కార్పోరేటర్‌ నుంచి మంత్రి వరకు.. విశాఖ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌‌కు జగన్ కేబినెట్‌లో చోటు.. - Telugu News | Gudivada Amarnath has secured a seat in YS Jagan Mohan Reddy ...

వైజాగ్ స్టీల్ ప్లాంట్ గాజువాక పరిధిలో ఉన్న నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా బీజేపి తీసుకున్న నిర్ణయాల కారణంగానే గాజువాకలో కూటమికి అనుకూల పరిస్థితులు లేవని తెలుస్తోంది. ఇతర హీరోల అభిమానులు కూడా గాజువాకలో గుడివాడ అమర్నాథ్‌కి ఎక్కువగా మద్దతు ఇస్తే మాత్రం కచ్చితంగా వైసీపీ విజయం సాధించడం ఖాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి గుడివాడ అమర్నాథ్‌కు ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని.. జగన్ బలవంతం మేరకు ఆయన ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్ అండతో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందో లేదో తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.