వార్నీ.. పుష్ప 2 లో ఆ బాలీవుడ్ హీరోయిన్ కూడా ఉందా.. భలే ట్విస్ట్ ఇచ్చారుగా..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా బ్యాక్‌గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డును అందుకొని రికార్డులు సృష్టించాడు. చివ‌రిగా బ‌న్ని నుంచి కవ‌చ్చిన‌ పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించిన అల్లు అర్జున్.. ఈ సినిమాలో తన మేనరిజం తో భారీ లెవెల్ లో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు ఆయన పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. పుష్పకు సిక్వల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు ఇప్పటికే రికార్డ్ స్థాయిలో జరిగాయని.. ఇప్పటివరకు మరి ఏ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అత్యధికంగా రూ.500 కోట్ల వరకు వరుస‌ బిజినెస్‌లు జరిగినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరోయిన్ ఉండబోతుందని.. అయితే ఆ హీరోయిన్ క్యారెక్టర్ అనేది సస్పెన్స్ గా పెట్టి సినిమా ఇంటర్వెల్లో రిలీజ్ చేయబోతున్నారని టాక్‌.

Bollywood actors in Pushpa 2

అయితే ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అమ్మడు అని సమాచారం అందుతుంది. కానీ ఆ హీరోయిన్ ఎవరు అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. థియేటర్‌లో సినిమా చూసినప్పుడు మాత్రమే ఆ హీరోయిన్ ఎవరు అనే క్లారిటీ వచ్చేలాగా.. అప్పుడే ఆ హీరోయిన్ క్యారెక్టర్‌ను రివిల్ చేసేలా మేకర్స్ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారట. ఇక బన్నీ ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే ఆయన మార్కెట్ మరో లెవెల్ కి వెళ్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.