నేను ఎంత చెప్పిన‌ వినకుండా అలాంటి పని చేసి నా భ‌ర్త కోట్లు పోగొట్టాడు.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్?!

టాలీవుడ్ స్టార్ నటి తులసికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు హీరోయిన్గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. శంకరాభరణం సినిమా నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు చేయని క్యారెక్టర్ అంటూ లేదు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా కెరీర్ కొనసాగిస్తున్న తులసి కేవలం న‌టిగానే కాదు ప్రొడ్యూసర్ గాను పలు సినిమాలను తెరకెక్కించింది. త‌న 28 ఏళ్ళ వ‌య‌స్సులో త‌మిళ్ డైరెక్టర్ శివమణిని ప్రేమించి వివాహం చేసుకుంది.

Senior Actress Tulasi With Husband Son Family Unseen Photos #ActressTulasi # tulasi #tollywoodactress - YouTube

వీరికి సాయి అనే ఒక కొడుకు ఉన్నాడు. ఇక శివమణి, తులసి ఇద్దరూ సినిమాల్లో నటీనటులుగా కొనసాగుతున్న క్రమంలో ఇండస్ట్రీలో నిర్మాతలుగా మారారు. ఇక తులసి భర్త శివమణికి తానే డైరెక్టర్గా, హీరోగా ఓ సినిమా తీయాలని కోరిక ఉండేదట. అప్పటివరకు వీరిద్దరూ సినిమాల ద్వారా బానే సంపాదించారు. దీంతో శివమణి రాత్రికి రాత్రి తానే సొంతంగా సినిమా తీయాలని ఉద్దేశంతో రెండు కోట్లు పోగు చేశారట. ఈ రెండు కోట్లతో సినిమా తీయగా అది డిజాస్టర్ గా నిలిచింది. అయితే తులసి అలాంటి సినిమా ఏమీ వద్దు అని చెప్పినా వినకుండా తులసి భర్త శివమణి సినిమా తీసి రెండు కోట్లను పోగొట్టుకున్నారట. అప్పటి నుంచి డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుందట తులసి.

Tulasi Shivamani Height, Weight, Age, Stats, Wiki and More

ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తులసి వివరించింది. తాను కూడా సొంతగా డబ్బు బానే సంపాదిస్తున్నానని.. ఇప్పటివరకు డబ్బు విషయంలో ఎటువంటి లోటు లేదు.. తెలుగులోనూ సౌత్ ఇండస్ట్రీలోనూ స్వయంగా వారే పిలిచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు ఇస్తున్నారని.. అయితే వచ్చిన సంపాదన కాపాడుకోవడంలోనే నేను ఫెయిల్ అయ్యానని.. ఇకపై అలాంటి తప్పు జరగబోదు అంటూ వివరించింది తుల‌సి. అయితే తన భర్త చేసే అప్పులకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. నేను ఎంత చెప్పినా వినకుండా ఆయన చేసిన పనికి ఆయనే బాధ్యత వహిస్తారు అంటూ వివరించింది. ఇప్పటివరకు దేవుడి దయవల్ల మా కుటుంబానికి తిండి, బట్ట విషయంలో ఏ లోటు లేదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తులసి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.