ఉపాసన కు మైండ్ బ్లోయింగ్ షాకిచ్చిన చిరంజీవి తల్లి..అంజన్నమ్మ మజాకా.. దెబ్బకు షటర్స్ క్లోజ్(వీడియో)..!

సమ్మర్ సీజన్ వచ్చేసింది .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఊరగాయలు పెడుతున్నారు . మరీ ముఖ్యంగా సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి ప్రతి ఒక్కరి ఇంట్లోనే పెడుతూ ఉంటారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేసింది ఉపాసన . ఆ వీడియోలో సురేఖ చిరంజీవి తల్లి అంజనమ్మ ఉపాసన మాట్లాడుతూ ఉండడం మనం చూడొచ్చు . మెగా ఫ్యామిలీలో ఆవకాయ పచ్చడి పెడుతున్నారు . దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసింది ఉపాసన .

ఈ క్రమంలోనే ఉపాసన చిరంజీవి అమ్మగారి దగ్గరికి వెళ్లి ..”నాయనమ్మ ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావు..? అంటూ అడుగుతుంది.. అందుకు అంజనమ్మా.. నవ్వుతూనే సీరియస్ ఏం లేదు పని లేక అలా ఖాళీగా కూర్చున్నాను అంతే అంటూ గట్టి పంచ్ వేస్తుంది.. వెంటనే ఉపాసన “మీ కోడలు మంచిగా ఊరగాయ పెట్టడం లేదా..? అంటూ అడుగుతుంది” దీనికి అంజనమ్మ “నువ్వు ఉన్నావు కదా మళ్ళీ నా కోడలితో ఎందుకు ఆ పని అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చింది”..

అందులో చూడడానికి సైలెంట్ గానే ఉన్నా సరదాగా మాట్లాడుతుంది అంటున్నారు జనాలు. అంతేకాదు ఉపాసన అత్తమ్మ దగ్గరకు వెళ్లి “క్యా హో రా” అని అడగ్గా నాకు హిందీ రాదు అంటూ నవ్వేస్తుంది సురేఖ . ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. కోట్ల ఆస్తి ఉన్నా సరే కుటుంబం అంతా ఒక్క దగ్గర కలిసి ఉండి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆ ఎంజాయ్మెంట్ వేరు అంటున్నారు మెగా అభిమానులు. మరికొందరు అంజనమ్మ మజాకా ఉపాసన షటర్స్ క్లోజ్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Athamma`s Kitchen (@athammaskitchen)