గుడ్ న్యూస్.. తారక్ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ ఎప్పటి నుంచి అంటే.. ?!

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస‌ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర, వార్ 2 సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న తారక్.. జులైలోగా ఈ సినిమాలను పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. దాదాపు ఏడాది క్రితం ఈ కాంబోలో సినిమా ఉంటుందంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

దేవరలో నాటు నాటును మించిన సాంగ్ ? Devara-War - Right Times Media

ఇక ఈ సినిమాను ఏప్రిల్ లో సెట్స్‌ పైకి తీసుకురావాలని భావించారు మేకర్స్. అయితే ఎన్టీఆర్ దేవర, వార్‌2 సినిమాల్లో బిజీగా ఉండడంతో ఈ మూవీ సెట్స్ పైకి రావడం ఆలస్యమైంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్‌లో మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. కేజిఎఫ్, స‌లార్ త‌ర‌హాలోనే రెండు భాగాలుగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ తుది దాశ‌కు చేరుకుంది.

NTR To Play Politician In Prashanth Neel Film?

దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. గతంలో తారక్, కొరటాల కాంబోలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం.. దీనికి తోడు ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత తారక్ నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో తారక్ మరోసారి రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.