‘ గేమ్ చేంజర్ ‘ మూవీకి బ్లాస్టింగ్ క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్న శంకర్.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోవాల్సిందే..?!

తమిళ్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇక శంకర్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తెర‌కెక్కించే ప్రతి సినిమాలోను ఒక్కో ఫైట్ లో ఒక్క కాన్సెప్ట్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా రూపొందుతున్న గేమ్ చేంజర్ లోను వేరే లెవెల్ లో హై ఆక్టిన్‌ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సీన్స్‌ సినిమాలో ఉన్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే 80% సినిమా షూటింగ్ పూర్తయిపోయిందట.

Game Changer

ఇందులో పలు యాక్షన్స్ సీన్స్ కూడా పూర్తయ్యాయని.. అయితే తాజాగా క్లైమాక్స్ ముందు ఓ యాక్షన్స్ స‌న్నివేశం వేరే లెవెల్ లో ఉండబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మన గ్లోబల్ స్టార్ ఏకంగా వెయ్య మందితో తలపడేలాగా ఒక యాక్షన్స్ సన్నివేశాన్ని రూపొందించాడట శంకర్. క్లైమాక్స్‌కి ముందు వచ్చే ఈ యాక్షన్స్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్ షెడ్యూల్ లో ఈ సీన్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ ఫైట్ సీన్ భారీ ఎత్తున విదేశీ ఫైటర్లు, స్థానిక ఫైటర్ల ఆధ్వర్యంలో రూపొందుతుందని.. విదేశీ స్టాంట్‌ మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ సన్నివేశాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.

Game Changer: The Ram Charan-Shankar biggie won't release in summer 2024;  here's when it will be out

వెయ్యి మందితో చరణ్ ప్రతిదాడి.. సినిమాకి హైలెట్ గా నిలవబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సీన్ కోసం చరణ్ ప్రత్యేకంగా రెడీ అవుతున్నాడా..? లేదా..? అనేదానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఇక శంకర్ తన డైరెక్షన్ లో వ‌చ్చే ఏ సినిమాలో అయినా ఫైట్ సీన్స్ డిజైన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రత్యేక ట్రైనింగ్ హీరోకి కూడా ఇప్పిస్తారు. చరణ్ కి అలా ఏదైనా ట్రైనింగ్ ఇచ్చారా…? లేదా…? అన్న దానిపై క్లారిటీ రాలేదు. అయితే ఈ ఫైట్ సీన్స్ ఎక్కడ ఉంటాయో తెలీదు కానీ ఫైట్ తర్వాత ఉండే క్లైమాక్స్ సన్నివేశాలన్నీ రాజమండ్రి, విశాఖపట్నంలో పూర్తి చేయనున్నట్లు యూనిట్ రివిల్ చేసింది. అయితే కొత్త షెడ్యూల్ ప్రారంభమైతే గానీ ఈ ఫైట్ సీన్స్ ఉన్నాయా లేదా..? అవి ఏ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు..? అనే దానిపై క్లారిటీ రాదు.