పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇవ్వబోతుందా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ పెళ్లిళ్ల మ్యాటర్స్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ట్రెండ్ అయ్యే ప్రతి వార్త అబద్దమని చెప్పడానికి లేదు ..చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లిల విషయాలు వాళ్ళు చెప్పడం కన్నా ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ గా మారాయి . తాజాగా ఓ హీరోయిన్ కి సంబంధించిన పెళ్లి వార్త సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ మీడియాలో మరోసారి ట్రెండింగా మారింది . నేను పెళ్లి చేసుకోవట్లేదు రా బాబు.. చేసుకుంటే ముందు మీకే చెప్తాను అంటూ ఆమె ప్రకటించిన కూడా .. ఆమె పెళ్లి వార్త ఈ రేంజ్ లో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. చాలామంది స్టార్ సెలబ్రెటీస్ పెళ్లి విషయాన్ని ఓపెన్ గా చెప్పడానికి ఇష్టపడరు. బహుశా కీర్తి సురేష్ కూడా అలాగే చేస్తుందేమో అంటున్నారు జనాలు .

గత 13 ఏళ్లుగా ఆమె ఒక ఫ్రెండ్ తో ప్రేమాయణం కొనసాగిస్తుంది అని .. ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు అని. ఆ కారణంగానే వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు అని.. కానీ కీర్తి సురేష్ ఆ అబ్బాయి ఒక డెసిషన్ తీసుకున్నకే పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయాలి అంటూ భావించారట ..కీర్తి సురేష్ ఇంకా సినిమాలో నటించాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తుందట . అలా ఆమె ఇండస్ట్రీలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాతనే పెళ్లి చేసుకుంటుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!