కెనాడా థియేటర్స్ లో ప్రభాస్ యాడ్.. ఏం వాడకం రా బాబు అంటూ షాక్‌లో ఫ్యాన్స్‌.. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే..?!

రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ గురించి.. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అంద‌రికి తెలుసు. ప్రస్తుతం తెలుగులో వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ మోస్ట్‌ బిజీ హీరోగా కొన‌సాగుతున్నాడు ప్రభాస్. ప్ర‌స్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా సినిమాలే అన్న సంగ‌తి తెలిసిందే. బాహుబలి సినిమాతో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ సంపాదించుకున్నాడు ప్ర‌భాస్‌. దీంతో ప్రభాస్ సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

ఇక ఈ స్టార్‌డమ్ ఓ రేంజ్‌లో యూజ్ చేసుకుంటూ ప్ర‌మోష‌న్స్‌ చేస్తుంది కెనడాకి చెందిన ఒక కారు రిపేరింగ్ సంస్థ. కెనడాలోని ఓ థియేటర్ లో మూవీ బ్రేక్‌లో కమర్షియల్ యాడ్స్ ప్లే చేస్తున్నారు.ఈ నేప‌ధ్యంలో అర్భ‌న్ ఆటో కొలిజ‌న్ అనే ఓ కెన‌డా కార్‌ రిపేరింగ్ సంస్థకి సంబంధించిన యాడ్‌ని కూడా ప్లే చేస్తూ సంస్థ‌ను ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. ఇక ఈ యాడ్ ని ప్రభాస్ మిర్చి మూవీ సీన్ తో యాడ్ చేసి డిజైన్ చేసి స్క్రీన్ పై వేస్తున్నారు.

మిర్చి సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ సీన్ లో ప్రభాస్ క‌టౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ చెప్తూ పక్కనే ఉన్న కార్‌ని కాలుతో తంతాడు. దాంతో ఆ కార్‌ టైర్ ఊడిపోతుంది. ఇక ఈ సీన్ ని చూపిస్తూ.. కారు రిపేర్ అవ్వగానే తమను సంప్రదించండి అంటూ అర్బన్ ఆటో కొల్లిజ‌న్ సంస్థ‌ యాడ్ ని డిజైన్ చేయించుకున్నారు. ఇక ఈ యాడ్ ని థియేటర్ లో చూసిన తెలుగు ఆడియన్స్ అంతా ఆశ్చ‌ర్య పోతున్నారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.