ఆ విషయంలో తారక్ ను కాపీ చేస్తున్న బన్నీ.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తారక్ దేవరకు బ్రేక్ ఇచ్చి వార్ 2 సెట్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బన్నీ కూడా ఈ విషయంలో తారక్‌నే ఫాలో అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు ఎక్కువ సమయం కేటాయించాడు. ఒక్క సిరీస్ మూవీ కోసం ఇప్పటివరకు ఇంత సమయాన్ని కేటాయించిన స్టార్ హీరో ఎవరు లేరు అనడంలో సందేహం లేదు. దీంతో బన్నీ కూడా ఒకేసారి రెండు ప్రాజెక్టులలో నటించాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ పూర్తికాగానే.. బన్నీ అట్లీతో ఓ సినిమాలో నటించనున్నాడని తాజాగా జరిగిన బ‌న్ని పుట్టినరోజుకి ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే ఆ అనౌన్స్మెంట్ ఆలస్యమైంది.

కాగా త్వరలోనే ఈ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ ఉంటుందని.. సెట్స్ పైకి సినిమాను అట్లీ తీసుకురానున్నాడని తెలుస్తుంది. ఓ పక్కన అట్లీ డైరెక్షన్‌లో సినిమాతో పాటు.. త్రివిక్రమ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ. దీంతో త్రివిక్రమ్ సినిమా కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుందట. కనుక పుష్ప 2 సినిమా కోలికి వచ్చినా రాకున్నా బన్నీ మాత్రం తన కొత్త ప్రాజెక్టులను కూడా సెట్స్ పైకి తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నాడట. మేకోవర్ సమస్య లేకపోతే ఒకే సమయంలో బన్నీ రెండు సినిమాలను సెట్స్‌ పైకి తీసుకురావాలని ఆలోచనలో బన్నీ ఉన్నాడని తెలుస్తుంది.