తారక్ ను ఆ ఇద్దరూ దారుణంగా మోసగించారా.. 12 ఎకరాల ల్యాండ్ కొంటామని అలా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తువులు, డబ్బు కంటే మనుషులకి ఎక్కువగా ప్రాధాన్యత నిస్తూ ఉంటాడు. తన స్నేహితులను, చుట్టుపక్కల వ్యక్తులను కూడా ఆయన త్వరగా నమ్ముతారు. అయితే సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు ఎంతో తెలివిగా ఇన్వెస్ట్ చేసే ఎన్టీఆర్.. ఇద్దరు వ్యక్తులను బాగా నమ్మడంతో దారుణంగా మోసపోయాడంటూ.. తన పేరుపై ఓ ల్యాండ్ కొంటామని తన స్నేహితులు ఇద్దరు చీట్ చేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ ఇద్దరు వ్యక్తులకు ఇంకా దూరంగా ఉంటూ వచ్చారట. ఈ విషయాన్ని టీడీపీ కీలక నేత చింతమనేని ప్రభాకర్ స్వయంగా వివరించారు.

జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు నేతల చేతిలో మోసపోయారని.. కోకాపేటలో 12 ఎకరాల ల్యాండ్ ఆయన పేరు పై కొంటామని మోసం చేశారని.. దీంతో ఆ ఇద్దరు నేతలకు తారక్ ఇప్పటికి దూరంగానే ఉంటున్నాడంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక ప్రస్తుతం కోకాపేట్ లో ఒక ఎకరం విలువ రూ.100 కోట్లు ఉంది. ఈ క్రమంలో తారక్ పేరుపై నిజంగానే అప్పుడు తమ స్నేహితులు ల్యాండ్ తీసుకుని ఉంటే.. దాదాపు ఆ ల్యాండ్ విలువ ఇప్పుడు రూ.1200 కోట్ల రేంజ్‌లో ఉండేది. ఈ క్రమంలో స్నేహితులు చేసిన మోసాన్ని తారక్ జీర్ణించుకోలేకపోయాడట. అందుకే ఇప్పటికి ఆ ఇద్దరు నేతలకు ఆయన దూరంగానే ఉంటాడంటూ చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు.

అయితే రాజకీయ నేతల ఆరోపణలను ఎప్పుడు పూర్తిస్థాయిలో నమ్మలేము. దీనిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తే గాని అసలు నిజం ఎంతుందో తెలియదు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వరస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుపుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే భారీ బిజినెస్ ఆఫర్లు రావడం రూ.100 కోట్ల రేంజ్ లో లాభాలు వస్తున్నాయని తెలుస్తోంది. తారక్ కెరీర్ పరంగా రోజురోజుకు తన క్రేజ్ ను రెట్టింపు చేసుకుంటున్నాడు. ఇక తాజాగా దేవరా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి వార్2 షూటింగ్ సెట్స్ లో తారక్ మెరిసిన సంగతి తెలిసిందే.