ఆ మూవీలో ఎన్టీఆర్ చనిపోతే ఏడ్చేసిన రాజమౌళి.. జక్కన మూవీలో హీరో పాత్ర వెనుక సీక్రెట్ ఇదే..!!

దర్శక ధీరుడు రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. బాహుబలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ ఖ్యాతిని మరింత పెంచాడు. ఇతర సినీ ఇండస్ట్రీలన్నీ తెలుగు ఇండస్ట్రీ వైపు తలెత్తుకుని చూసే స్టేజ్‌కు తీసుకువచ్చాడు. ఇండియన్ డ్రీమ్ గా ఉన్న ఆస్కార్ ను ఈ సినిమాతో రాజమౌళి అందుకున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ లెవెల్లో దర్శకుడుగా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన్న. అయితే తన సినిమాలో హీరోల పాత్రలకు మాత్రం ఒక్క విషయాన్ని రూల్ గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్ సినిమా ఇన్స్పైర్ చేయడంతో రాజమౌళి తన సినిమాల్లో హీరో పాత్రల విషయంలో ఆ రూల్ పెట్టుకున్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. జక్కన్న పెట్టుకున్న రూల్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. మొదట ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1తో ఇండస్ట్రీకి ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి. ఈ సినిమా తర్వాత సింహాద్రి, ఛత్రపతి ఇలా ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నాడు. అయితే ప్రభాస్ తో చత్రపతి సినిమా తెరకెక్కించిన క్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో ప్రభాస్‌తో కలిసి హాజరై సందడి చేశాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి మాట్లాడుతూ ఆయనకు యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టమని వివరించాడు.

ఇక చిన్ననాటి సంఘటన గురించి గుర్తు చేసుకుంటూ తన కుటుంబం చాలా పెద్దదని.. 13 మంది కజిన్స్ ఉన్నారంటూ వివరించాడు. అందులో కాంచీ, రాజన్న ఇద్దరు పెద్దవాళ్లు వాళ్ళకి మాత్రమే నెలకు రెండు సినిమాలు చూసే ఛాన్స్. మేము 8 మంది ఉండే వాళ్ళం మాకు మాత్రం నెలకు ఒక్క సినిమానే చూసేలా కండిషన్స్ పెట్టారు. ఆ సమయంలో మా ఊర్లో రెండు థియేటర్లు ఉండేవి. అందులో ఓ థియేటర్‌లో అగ్గిపిడుగు.. ఒక థియేటర్‌లో మంచి చెడు సినిమాలు ఆడుతున్నాయి. రెండు సినిమాల్లోను ఎన్టీఆర్ హీరో. అప్పటికే మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అగ్గిపిడుగు సినిమాను చూసేసారు.

అందులో కత్తి ఫైట్లు, యాక్షన్ స‌న్నివేసాలు చాలా ఉన్నాయని.. ఇంట్లో వాళ్ళు చెప్పడంతో వచ్చేవారం ఆ సినిమాను కచ్చితంగా చూడాలని రాజమౌళి చాలా వెయిట్ చేశాడట. అగ్గిపిడుగు సినిమాకి వెళ్దామని.. రెడీ అయిన తర్వాత మంచి చెడు సినిమాకు వెళ్దాం. అందులో అన్ని ఫైట్లే ఉంటాయి.. అగ్గిపిడుగులో రెండు ఫైట్లే ఉంటాయి అని అబద్ధం చెప్పి న‌ను సినిమాకు తీసుకువెళ్లారు. అయితే నేను సినిమాల్లో ఫైట్ల కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇంటర్వెల్ సీన్ వచ్చేసింది. ఒక ఫైట్ కూడా లేదని ఏడవడం మొదలు పెట్టా అంటూ వివ‌రించాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ దొంగల్ని చుట్టుముట్టడం ఒక ఫైట్ సీన్ అని భావించా కానీ అది కూడా ఫైట్ సీన్ కాదు.

ఇక చివరి వరకు కూడా ఒక్క ఫైట్ సన్నివేశం కూడా సినిమాలో లేదు. దీంతో నేను బాగా ఏడ్చా.. ఫైట్ లేని సినిమాకు తీసుకువచ్చారని అన్నల ముందు గోల చేశా. ఇక ఈ మూవీ ఎండింగ్ లో హీరో ఎన్టీఆర్ చనిపోతాడు. ట్రాజెడీ ఎండింగ్ చూసి నాకు చిరాకు వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత ఒక విషయాన్ని మాత్రం బాగా ఫిక్స్ అయ్యాన‌ని వివరించాడు. ఆ ట్రాజెడీ ఎండింగ్ చూసి నా జన్మలో ఇలాంటి ఎండింగ్ ఏ సినిమాకు ఉండకూడదు అని నిర్ణయించుకున్నాడట రాజమౌళి. అందుకే తను తీసే సినిమాలకు ట్రాజెడీ ఎండింగ్ లేకుండా కచ్చితంగా యాక్షన్ సన్నివేశాలు ఉండేటట్లు చూసుకుంటాడట.