సాయి పల్లవికి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడేది ఈ ముగ్గురు స్టార్సే.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా రాణిస్తూ స్టార్ హీరోయిన్ల లిస్టులో మొదటి వరుసల పేరు సంపాదించుకుంది సాయి పల్లవి. నటించినది అది తక్కువ సినిమాలైనా.. సాయి పల్లవి చేసిన ప్రతి సినిమాకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం తాండేల్ సినిమాతో సాయి పల్లవి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. నాగచైతన్య, సాయి పల్లవి హిట్ కాంబోలో ఈ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో సినిమా తీసేందుకు మేకర్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే సాయి పల్లవికి ఏ సమస్య వచ్చినా సపోర్ట్ చేసే విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు సెలబ్రిటీస్ ముందు వరుసలో ఉంటారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ ముగ్గురితో సాయి పల్లవికి మంచి స్నేహబంధం కూడా ఉందట. ఇంతకీ ఆ ముగ్గురు సెలబ్రిటీస్ ఎవరో తెలుసుకుందాం.

Rana is a Torch Bearer says Sai Pallavi

టాలీవుడ్ లో సాయి పల్లవికి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సాయం చేసే వారిలో రానా, నాగచైతన్య డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముందు వరుసలో ఉంటారట. వీరి ముగ్గురితో సాయి పల్లవికి మంచి స్నేహబంధం ఉందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల మూవీ ద్వారా తెలుగులో సాయి పల్లవి ఊహించని రేంజ్ లో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు సాయి పల్లవి సినీ కెరీర్ లోనే బెస్ట్ సినిమాలుగా నిలిచాయి. సాయి పల్లవి ఇతర ఇండస్ట్రీలపై ఫోకస్ పెడితే అక్కడ కూడా ఇదే రేంజ్ లో సక్సెస్ సాధించడం ఖాయం అంటూ తమ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక సాయి పల్లవి రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటుంది.

Sekhar Kammula not happy with Chaitu and Sai Pallavi? - TeluguBulletin.com

ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఆమె రమ్యనరేషన్ చాలా లిమిట్ గా ఉంటుంది. అలాగే ఆమె యాడ్స్‌కు కూడా దూరంగానే ఉంటుంది. ఇక సినిమా ఆఫర్లు తగ్గిన తర్వాత సాయి పల్లవి డాక్టర్‌గా కెరీర్ కొనసాగించాలని భావిస్తుండడం విశేషం. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా సక్సెస్ తెచ్చుకున్న సాయి పల్లవి ఆస్తుల విషయంలో కూడా చాలా తక్కువగానే సంపాదిస్తోంది. ఇక‌ ఈ ముద్దుగుమ్మ రాబోయే రోజుల్లో ఆయన సినిమాల విషయంలో వేగం పెంచుతారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సాయి పల్లవి డ్యాన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముందుముందు భారీ క్రేజీ ప్రాజెక్టులతో సాయి పల్లవి ప్రేక్షకుల ముందుకు వస్తే ఆమె మరింత సక్సెస్ అవుతుందని ఫాన్స్ తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.