ఫ్లైట్ లో అలా చేసిన హీరోయిన్ .. సీరియస్ అయిన ప్రభాస్.. పిక్స్ వైరల్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ హీరోయిన్ దిశా పటానిపై ఫైర్ అయ్యారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే వీళ్ళిద్దరి కాంబోలో కల్కి సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తుంది . దిశా పటానీ మరోక హీరోయిన్ గా ఆకట్టుకోబోతుంది .

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మించబోతున్నాడు అశ్విని దత్. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాపై జనాలు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు . వైజయంతి మూవీస్ కి బాగా కలిసి వచ్చిన మే 9న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం . లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది . ఇటలీలో ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ షూటింగ్ జరుపుకోనున్నారు అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు .

ప్రభాస్ – నాగ్ అశ్వీన్ – దిశాతో పాటు మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సాంగ్ షూట్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు . తాజాగా దీనికి సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది. విమానంలో అందగత్త దిశ.. డార్లింగ్ ను ఫోటో తీస్తూ కనిపించింది . ఈ క్రమంలోనే ప్రభాస్ ఏదో సీరియస్ గా చెబుతున్నట్లు అర్థమవుతుంది. అయితే ఇది ప్రభాస్ కోప్పడిన పిక్ కాదు అంటున్నారు జనాలు . అంతేకాదు ఇక ఈ ఫోటో మేకర్స్ షేర్ చేస్తూ”ఏ డార్లింగ్ పిక్”.. ఇటలీ డైరీస్ అంటూ రాసుకోచ్చారు . దీంతో దిశా పటానిపై సీరియస్ అయ్యాడు ప్రభాస్ అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. ఈ సాంగ్ పూర్తిగా రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కబోతుందట. ఈ సాంగ్ లో మన డార్లింగ్ హద్దులు మీరి పోబోతున్నాడట . అయితే మన డార్లింగ్ లో అలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయా..? అంటూ షాక్ అయిపోతున్నారు రెబల్ అభిమానులు..!!