తెలుగులో రిలీజ్ కానున్న ఆ బ్లాక్ బస్టర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్..

కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ దా..దా.. సినిమాను పాపా పేరుతో గణేష్ కే బాబు డైరెక్షన్లో తెలుగులో తెర‌కెక్కిస్తున్న‌రు. కవిన్, అపర్ణ దాస్, మౌనిక చిన్నకోట్ల, ఐశ్వర్య భాగ్యరాజ్, ఈటీవీ గణేష్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను జేకే ఎంటర్టైన్మెంట్స్ ఎంఎస్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను డైరెక్టర్ త్రినాధరావు చేతుల మీదుగా గ్రాండ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా త్రినాధరావు మాట్లాడుతూ తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన దా..దా.. సినిమాను తెలుగులో పా..పా..గా మన ముందుకు తీసుకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

Dada (2023) - IMDb

డైరెక్టర్ గణేష్ .కే .బాబు ప్రతి సీన్‌ను చాలా బాగా రాసాడు అంటూ వివరించారు. ఇది ఒక నాన్న క‌థ మాత్రమే కాదు. ఒక స్నేహితుడు, ఒక అమ్మ కథ, ఒక లవర్ కథ అంటూ వివ‌రించాడు. ఈ సినిమాని నేను చూశా ఎంతో అద్భుతంగా ఉంది.. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా.. ఈ సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ వివరించాడు. ఇక నిర్మాత ఎమ్.ఎస్‌ రెడ్డి మాట్లాడుతూ గతంలో సాహసం చేయరా డింభకా అనే సినిమాతో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు ఈ పా..పా.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం.

Dada | Song - Pogathey | Tamil Video Songs - Times of India

దాదాపు 50 రోజుల తర్వాత తమిళ్ దా..దా.. సినిమాను థియేటర్లో చూశా. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. చెప్పగానే నా యూఎస్ ఫ్రెండ్స్ కూడా రియాక్ట్ అయి తెలుగులో రాద్్ద‌మ‌ని రెడీ అయ్యారు. ఈ సినిమా అతి తంవ‌ర‌లో మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాను ఆదరించాలని మంచి సక్సెస్ అందిస్తారని కోరుకుంటున్నం. అలాగే డైరెక్టర్ త్రినాధ్‌ రావు గారికి నా కృతజ్ఞతలు అంటూ వివరించాడు. ఇక తమిళ్లో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ దా..దా.. తెలుగులో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.