మెగా పవర్ స్టార్ పై కన్నేసిన శత్రుదేశం.. పాకిస్తాన్ లో రామ్ చరణ్ గురించి చర్చలు..

రామ్ చరణ్ చివరిగా నటించిన మూవీ ఆర్‌ఆర్ఆర్‌. ఈ సినిమాల్లో రామరాజు పాత్రలో తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు చెర్రీ. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న చరణ్.. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో అదెగొట్టాడు. అయితే రామ్ చరణ్ గురించి పాకిస్తాన్ మీడియాలో కూడా చర్చ జరుగుతుండడం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింటే తెగ చక్కర్లు కొడుతుంది. పాక్ మీడియాలో ఓ ఛానల్‌ చరణ్ గురించి మాట్లాడుతూ రామరాజు పాత్ర పోషించిన చరణ్ వేల మంది మధ్యలోకి వెళ్లి ఫైట్ చేసి మళ్లీ తిరిగి అదే ప్లేస్ కి రావడం చాలా మైండ్ బ్లోయింగ్ గా అనిపించిందని.. ఆ సన్నివేశం చూడడానికి అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ కు భారత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న‌ సంగతి తెలిసిందే.

Thyview on X: "Ramaraju's Introduction as Ruthless cop driven by strong  motto can't be better than this. When @ssrajamouli himself stated that it  is his career best scene, he very well have

అయితే మన శత్రుదేశం అయిన పాకిస్తాన్‌లో కూడా రామ్‌చరణ్ నటనకు ప్రశంసలు రావడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను చెర్రీ అభిమానులు ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా కావ‌డంతో గేమ్ చేంజర్‌ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు దానికి క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. ఇక ఈనెల 28న ఈ సినిమా నుంచి జరగండి.. జరగండి.. సాంగ్.. అలాగే దిల్‌రాజు కూడా చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్‌కు సంబంధించిన అప్డేట్ ఇస్తానని వివరించాడు.

RRR's Exhilarating Character Introductions Stand Out From Other Action Films

అది గేమ్ చేంజ‌ర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్డేట్ అయితే బాగుండ‌ని.. ఫ్యాన్స్ భావిస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఎటువంటి క్లారిటీ వస్తుందో వేచి చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్గా కీయారా అద్వాని నటిస్తుంది. ఇక గేమ్ చేంజర్‌ సినిమా మొదలై మూడేళ్లు కావస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సమయానికి తగ్గ ఫలితం వస్తుందో లేదో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక దిల్ రాజు, రామ్ చరణ్‌ల‌ది హిట్ కాంబో కావడంతో ఈ సినిమా మంచి లాభాలను అందిస్తుందని నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.