స్టార్ హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమైన సిద్దు జొన్నలగడ్డ.. సీక్రెట్ రివిల్ చేసిన బ్రదర్.. ?!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ల‌ సీజన్ జోరుగా సాగుతుంది. ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరో, హీరోయిన్లు అంతా గత కొంతకాలంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి జంటలుగా మారుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీస్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు హీరో కిర‌ణ్‌ అబ్బవరం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. దానిపై పిక్స్‌తో క్లారిటి కూడా వ‌చ్చేసింది. ఇక ఇలాంటి క్ర‌మంలో మరో యంగ్‌ హీరో త్వరలోనే వివాహం చేసుకుంటున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన మరెవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జనులగడ్డ.

DJ Tillu 2 Archives | Telugu360.com

ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తూ డీజే టిల్లుతో హిట్ కొట్టి బ్రేక్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో.. కాగా ప్రస్తుతం ఈ హిట్ సినిమాకు సీక్వల్గా టిల్లు స్క్వేర్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు ఈ యంగ్ హీరో. ఈ నేపథ్యంలో త్వరలోనే ఓ స్టార్‌ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సిద్దు జొన్నలగడ్డ సోదరుడు.. చైతు జొన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. బబుల్గం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న చైతూ ఇటీవల మరో రెండు మూడు సినిమాల్లో నటించి.. ఇక‌ ఆ ఇంటర్వ్యూలో భాగంగా సిద్దుజొన్న‌ల‌ గడ్డ వివాహం గురించి చైతును యాంకర్ ప్రశ్నించాడు. సిద్దు జొన్నలగడ్డ గారు స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడు. వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి..

Bubble Gum: 'బబుల్ గమ్' సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరో తెలుసా ?.. ఆ  యంగ్ హీరో అన్నయ్యే.. - Telugu News | Do you know Siddhu Jonnalagadda  brother Chaitu Jonnalagadda played father ...

అది నిజమేనా.. అని ప్రశ్నించగా దానికి చైతు ఇంట్రెస్టింగ్ సమాధానాన్ని చెప్పాడు. స్టార్ హీరోయిన్‌ను చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్టార్ హీరోని చేసుకుంటేనే కదా అసలు ప్రాబ్లం అంటూ కామెడీ చేశాడు. అయితే స్టార్ హీరోయిన్‌నే పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియదు గాని.. కచ్చితంగా పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ అయితే సిద్దుకి ఉంది అంటూ చైతు వివరించాడు. అది కూడా వివాహం వచ్చే ఏడాది కూడా జరుగుతుందో లేదో తెలియదు.. ఆ టైంకి అన్ని ఓకే అనుకుంటే.. జరిగిపోవచ్చు అంటూ ఆయన వివరించాడు. ప్రస్తుతం చైతు జొన్న‌ల గడ్డ చేసిన ఈ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి.