సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నా అన్వేషణ – సన్నీ యాదవ్.. నిజాలను బయటపెడుతున్న యూట్యూబర్స్..!

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. దీనికి కారణం నా అన్వేషణ మరియు సన్నీ యాదవ్ మధ్య జరిగే గొడవే. సన్నీ యాదవ్ బైక్ రైడ్ పై అమెరికా చేరుకున్నానని ఓ వీడియో పెట్టిన నాటి నుంచి నేటి వరకు నా అన్వేషణ దానిని ఖండించడం మొదలుపెట్టాడు. వాడక దొంగ నా కొడుకు అని.. వాడు చెప్పేవన్నీ అబద్ధాలని.. అదేవిధంగా తాను ఫ్లైట్ పై వెళ్లి బండిని షిప్ లో షిఫ్ట్ చేశాడని ఆరోపించాడు.

ఇక నా అన్వేషణ ఆరోపణలను చూసిన సన్నీ యాదవ్ సైతం తిరగబడడం మొదలుపెట్టాడు. నేను నిజంగానే వెళ్లానని నీకు లాగా అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతకడం లేదని పచ్చి బూతులు తిట్టుకుంటూ వచ్చాడు. అలా వీరిద్దరి మధ్య చెలరేగిన గొడవ కాస్త పెద్ద వార్ కింద మారింది.

ప్రస్తుతం ఒకరిపై ఒకరు బూతు కామెంట్లు చేసుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నారు. ఇక ఇటీవలే సన్నీ యాదవ్ ఓ వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియోలో నా అన్వేషణను ఘోరంగా తిట్టిపోస‌డు. ఇక వీరిద్దరికీ కొందరు మద్దతు తెలియజేస్తున్నారు కూడా. పలు యూట్యూబర్స్ వీరిద్దరి పై స్పందిస్తూ నిజానిజాలను బయటపెడుతున్నారు. ఇక వీరిలో నిజం ఎవరిది అని అది మాత్రం క్లారిటీ రాలేదు.