క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలు, చిన్ననాటి ఫొటోస్ బయటకు రావడం అది క్షణాల్లో వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నం. అలాంటి వార్తలు చూడడానికి నెట్టిజ‌న్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతిసారి తమ అభిమాన హీరో, హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో సెర్చింగ్ చేస్తూనే ఉన్నారు. అటు సెలబ్రిటీస్ కూడా తమకు ఇష్టమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీస్ చైల్డ్హుడ్ ఫొటోస్ ను అప్డేట్స్ ను షేర్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఓ చిన్నారి ఫోటో నెట్టింట తెగచక్కర్లు కొడుతుంది.

Happy Birthday Shobana: 6 films of the veteran actress one must watch | The  Times of India

ఒకప్పుడు ఈమె టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ బ్యూటీ. ఎంతోమంది హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి టాలీవుడ్ అగ్ర తారల అందరి స‌రస‌న నటించి మెప్పించింది. కేవలం కథానాయక గానే కాకుండా క్లాసికల్ డ్యాన్స‌ర్‌గాను రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. తానే సీనియర్ బ్యూటీ శోభన. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 1986లో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన విక్రమ్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మువ్వా గోపాలుడు, మెగాస్టార్ చిరంజీవి రుద్రవీణ, రౌడీ గారి పెళ్ళాం, అల్లుడుగారు, రౌడీ అల్లుడు లాంటి ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది.

Shobana:కరోనా బారిన పడిన సినీయర్ హీరోయిన్.. అందరూ టీకా వేసుకోవాలంటూ  పోస్ట్.. - Telugu News | Actress shobhana tests positive for omicron  request public to get vaccinated | TV9 Telugu

తెలుగులోనే కాక మలయాళ, తమిళ, హిందీలో నటించిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గాను ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనా శోభన ఎంతమందికి భరతనాట్యం శిక్షణ ఇస్తుంది. 1994లో రిలీజ్ అయిన మణిచిత్రతళు సినిమాకి ఆమెకు భారత ప్రభుత్వం నుంచి జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందింది. 2001లో నటి రేవతి డైరెక్షన్ వహించిన మిత్రమా మై ఫ్రెండ్ అనే ఇంగ్లీష్ సినిమాకి కూడా రెండవసారి ఆమెకు ఉత్తమ నటి అవార్డు అందింది. ఐదు పదుల వయసు దాటిన ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా భరతనాట్యం శిక్షణ ఇస్తూ ఆకట్టుకుంటుంది.