సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.. చిరంజీవి..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి వరుసలో ఉంటారు. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ భారీ పాపులారిటి దక్కించుకున్నాడు. అయితే మొదటి చిరంజీవి, సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఓ సినిమాలో సెకండ్ హీరోగా మెప్పించాడు. ఆ సినిమాలో చిరంజీవి నటన చూసిన‌ ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటిస్తున్నావు బ్రదర్.. ఖచ్చితంగా నువ్వు స్టార్ హీరో అవుతావు అంటూ చిరంజీవిని పొగిడేసారట. ఇక సినిమాలో ఒక ఫైట్స్ స‌న్నివేశంలో ఇద్దరు కలిసి నటించాల్సి ఉండగా.. ఇద్దరు కలిసి ఒక గ్లాస్ మీద దూకే షార్ట్ ని షూట్ చేస్తున్నారు. ఆ టైంలో చిరంజీవి డైరెక్టర్ చెప్పిన వెంటనే ఓకే అని డైరెక్ట్ గా గాల్లో రౌండ్స్ తిరిగి ఒక గ్లాస్ పైకి జంప్ చేశాడట.

Chiru Party, Sr. NTR Reaction!

ఇక దాంతో ఎన్టీఆర్.. చిరంజీవి దగ్గరికి వెళ్లి బ్రదర్ మనకి డూప్‌ల అవసరం తప్పనిసరిగా ఉంటుంది. మనం దూకినట్టుగా చిన్న రియాక్షన్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అంటూ వివరించాడట. హీరో అనేవాడు సినిమాకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి.. తనకు ఏదైనా గాయం జరిగి కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తే.. సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోతుంది. దానివల్ల నిర్మాతలకు విపరీతమైన నష్టం కలుగుతుంది. అలాగే ఆ సినిమా కోసం కష్టపడే రోజు వారి కార్మికుల పొట్ట కొట్టిన వాళ్లమవుతాం. అందుకే కళాకారుల ఆరోగ్యం చాలా అవసరం. ఏవైనా రిస్కీ షాట్స్ ఉన్నప్పుడు వెంటనే డూప్లతో చేయాలి.

How Sr NTR's Advice Helped Chiranjeevi and His Family Sustain- Republic  World

ఇంకెప్పుడూ ఇలాంటి రిస్కులు చేయవద్దు బ్రదర్.. అంటూ ఎన్టీఆర్, చిరంజీవికి సలహా ఇచ్చాడట. ఇక ఇప్పటికీ ఈ మాటలు చిరంజీవి గుర్తుంచుకున్నార‌ని.. ఎన్టీఆర్ గారి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటారని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి కూడా చిరంజీవి డూపులను వాడుకోవాలని, రిస్క్ చేయకూడదు అంటూ సలహాలు ఇస్తూ ఉంటాడట. నిజానికి ఆర్టిస్టులు చాలా ఇంపార్టెంట్ పర్సన్ కావడంతో.. వారు ఏ కారణాలతో అయినా రెండు, మూడు నెలలు గ్యాప్ ఇచ్చారంటే మేక‌ర్స్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే తప్పనిసరిగా డూప్‌ల‌ను హీరోలు వాడుకోవాలి అంటార‌ట‌ చిరంజీవి.