నమ్రతకు అస్సలు నచ్చని .. మహేశ్ బాబు నటించిన రెండు సినిమాలు ఏంటో తెలుసా..?

నమ్రత శిరోద్కర్.. ఒకప్పుడు ఇండస్ట్రీని అల్లాడించేసినా ఓ హాట్ బ్యూటీ ..ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఉన్న మహేష్ బాబు భార్య . పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నమ్రతా శిరోద్కర్ పూర్తిగా తన లైఫ్ ని ఫ్యామిలీకి అంకితం చేసేసింది. భర్త బిడ్డలతో లైఫ్ లో చక్కగా ముందుకు తీసుకెళ్తుంది . కాగా నమ్రత శిరోద్కర్ కి మహేష్ బాబు నటించిన రెండు సినిమాలు అస్సలు ఇష్టం లేదు అన్న వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది.

 

మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . కొన్ని ప్లాప్లు కొన్ని హిట్లు అయ్యాయి. అయితే మహేష్ బాబు నటించిన రెండు సినిమాలు మాత్రం నమ్రత శిరోద్కర్ అస్సలు చూడదట .చూడడానికి ఇంట్రెస్ట్ కూడా రాదట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఆ రెండు సినిమాలు మరి ఏవో కావు..మహేష్ నటించిన టక్కరి దొంగ సినిమాతో పాటు బాబీ సినిమా కూడా నమ్రతకు అస్సలు నచ్చవట .

ఎందుకో ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ అంతగా అనిపించలేదు అని నమ్రత బాధపడిపోతూ ఉంటుందట . అంతేకాదు అసలు ఇప్పటివరకు ఈ సినిమాలను ఆమె పూర్తిగా కూడా చూడలేదట .ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు ఆమె ఆన్సర్ చేసింది . ప్రెసెంట్ ఆమె కి సంబంధించిన ఈ వార్త వైరల్ అవుతుంది. మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళితో ఓ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పై కి వెళ్లబోతుంది..!!