చిన్నారిని దత్తత తీసుకున్న బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్.. అసలు కారణం ఇదే..

సౌత్ ఇండస్ట్రీలో బిగ్ బాస్ షో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని భాషల్లోనూ విడివిడిగా బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్‌ల వారీగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. అలా ఇటీవల కన్నడ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ గా వ్యవహరించింది సోను శ్రీనివాస్.. బిబి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇండస్ట్రీలో భారీ పాపులారి దక్కించుకుంది. కాగా ఇటీవల రాయచూర్ లోని ఓజంట దగ్గర నుంచి 8 ఏళ్ల పాపను దత్తత తీసుకున్న సోను.. ఆ పాప మంచి చెడులు ద‌గ్గ‌రుండి చూసుకుంటుంది.

Bigg Boss Kannada OTT Star Sonu Srinivas Gowda Arrested Over 8-Year-Old  Adoption: Details Here

కాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా పాపకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్‌ని ఫిధా చేస్తుంది. అయితే ఆమె దత్తత తీసుకున్న విషయంపై కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే.. మరి కొందరు మాత్రం దానిని నెగిటివ్గా చేస్తూ కామెంట్లు చేస్తూన్నారు. ఆ పాపను దత్తత తీసుకున్న సోను శ్రీనివాస్ నియమాలను ఉల్లంఘించి.. సోషల్ మీడియా ద్వారా మరింత పాపులర్ అయ్యేందుకు ఆ పాపను వాడుతుందని చిన్నారిని దత్తత తీసుకోవడానికి కారణం అదేనంటూ.. కామెంట్లు వినిపించాయి.

बिग बॉस' फेम अभिनेत्रीला अटक, आठ वर्षांची मुलगी दत्तक घेतल्याप्रकरणी  पोलिसांची कारवाई | Bigg Boss Kannada contestant Sonu Srinivas Gowda  arrested in child adoption matter

ఈ విషయం చైల్డ్ వెల్ఫేర్ అధికారుల దృష్టికి వెళ్లడంతో బైదరహ‌లి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కాగా సోను శ్రీనివాస్ అరెస్ట్ న్యూస్‌తో అంత ఆశ్చర్యపోతున్నారు. అయితే సోను శ్రీనివాస్ అరెస్టుకు కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి విధంగా స్పందించలేదు. ఆమె చేసింది ముమ్మాటికి తప్పేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. పోలీసులు విచారణ తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి. కేవలం సోను ఆ చిన్నారితో రియల్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడం వల్లే ఆమెకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు.