నన్నంటే భరించా కానీ అతడిని విమర్శిస్తే ఊరుకోను.. ఇలియానా కామెంట్స్ వైరల్..

నాజూకు నడుము సుందరి ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది ఫాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే తర్వాత సరైన అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైనా ఈ ముద్దుగుమ్మ.. గతేడాది తన ప్రేగ్నెన్సీ ని అనౌన్స్ చేసింది. పెళ్లికాకముందే ప్రెగ్నెంట్ అయిందంటూ ఇలియానాకు సంబంధించిన వార్త‌లు నెటింట తెగ చెక్కర్లు కొట్టాయి. ఇక గ‌తేడాది ఈ బ్యూటీ ఓ మ‌గ బిడ్డ‌కు జ‌న్య నిచ్చింది. త‌న‌ కొడుకు కోవా ఫినిక్స్ డోల‌న్‌ పుట్టిన తర్వాత భాగస్వామిని పరిచయం చేసింది.

Ileana D'Cruz opens up about motherhood, partner Michael Dolan, and  marriage plans; says, “I am not comfortable with people talking rubbish  about my partner or my family” : Bollywood News - Bollywood

తన ప్రియుడు.. భాగస్వామి.. మైకల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. తన ఇష్టాఇష్టాలను మైఖేల్ ఎంతో గౌరవిస్తాడని.. త‌న కొడుకు రాకతో వారిద్ద‌రి జీవితాలు ఆనందంగా మారాయని వివరించింది. ఇక నాకు గ‌తేడాది అంతా చాలా సంతోషంగా గడిచిందని.. జీవితంలో అది ఎంతో ప్రత్యేకమైనది అంటూ వివరించింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత పని చేయాలనుకున్నా పరిస్థితులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌టంతో ఆ ఆలోచ‌న‌ విరమించుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్న టైంలో అమ్మ తనకు అండగా నిలిచిందని.. డెలివరీ తర్వాత ఒత్తిడికి లోనైతే తన భాగస్వామి మైఖేల్ సపోర్ట్ అందించాడని చెప్పుకొచ్చింది.

Is Ileana D'Cruz Married To Beau Michael Dolan And Settled In The USA Now?  Here's What We Know

అయితే వారిద్దరి బంధం గురించి పబ్లిక్ గా చెప్పేందుకు తనకు ఇష్టం లేదని.. అలా గతంలో ఓసారి చెప్పి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. నా గురించి ఏం మాట్లాడినా నేను భరిస్తా.. అసలు వారి మాటలను పెద్దగా పట్టించుకోను.. అయితే నా భాగస్వామి గురించి కుటుంబం గురించి ఎవరైనా విమర్శిస్తే అసలు ఊరుకోలేను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇలియానా చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో ఇలియానా తన కుటుంబానికి పార్ట‌న‌ర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది.. అలాంటి అమ్మాయినే అంతా భాగస్వామిగా కోరుకుంటారు అంటూ కామెంట్ చేస్తున్నారు.