వాట్.. మట్కా మూవీ అతని బయోపిక్ ఆ.. అసలు ఊహించని ట్విస్ట్..

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న మూవీ మట్కా. ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని పలాస ఫ్రేమ్ డైరెక్టర్ క‌రుణ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ డ్యాన్సర్ నౌరపతేహి హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక ఇటీవల గ్రాండ్ లెవెల్‌లో జరిగింది.

Matka Opening Bracket: Varun Tej Makes A Ferocious Promise | cinejosh.com

1958 – 82 కాలంలో జరిగిన‌ నేపథ్య కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎలాగైనా గట్టి హిట్ కొడ‌తాన‌ని నమ్మకం పెట్టుకున్నారు. తాజాగా అందుతున్న‌ సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక గ్యాంబ్లర్ బయోపిక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అతనే రతన్ కత్రి. మట్కా కింగ్‌గా పేరు తెచ్చుకున్న రతన్ బాలీవుడ్‌లో నిర్మాతగా మంచి సినిమాలను తెర‌కెక్కించాడు. 1960 – 80 ల మధ్యన భారతదేశంలో మట్కా బిజినెస్ చేసి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు.

मटका किंग रतन खत्री का मुंबई में लंबी बीमारी के बाद निधन – News18 हिंदी

ఇక ఆ డబ్బుతో 1976లో రంగీలా రత‌న్‌ సినిమాలతో నిర్మాతగా మారాడు. ఇక అతని జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా మట్కా సినిమాను తెర‌కెక్కిస్తున్నారట. ఇందులో మట్కా కింగ్ గా వరుణ్ తేజ్ నటిస్తున్నాడని.. ఇదంతా వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతుందని సమాచారం. ఇందులో వరుణ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడట. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే మేకర్స్‌ నుంచి అఫీషియల్ డీటెయిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.