నడ్డి రోడ్డుపై అలాచేస్తూ అడ్డంగా దొరికిపోయిన శోభశెట్టి, టేస్టీ తేజ.. పోలీసుల రాకతో అక్కడి నుంచి జంప్..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్లుగా అడుగు పెట్టిన బుల్లితెర ప్రేక్షకులంతా మిగతా అన్ని సీజన్స్ కంటే ఎక్కువగా పాపులారి దక్కించుకున్నారు. తమ ఆట తీరు, కామెడీ, ఎమోషన్స్ తో ప్రేక్షకులను మెప్పించారు. అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా వీరు అదే రెంజ్‌లో పాపులర్ అవుతున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ తమ క్రేజ్ మరింత పెంచుకుంటున్నారు. అదేవిధంగా ఇక తాజాగా టేస్టీ తేజ, శోభ శెట్టి కలిసి కారులో షాపింగ్ కు వెళ్తూ ఉండగా మధ్యలో బైక్ ఢీకొట్టారు. ఆ తర్వాత వాళ్లతో జరిగిన గొడవను పోలీసులు అక్కడికి రాగానే వాళ్ళిద్దరూ జంప్ అయిన విధానం గురించి వార్తలు నెట్టింట వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.

Bigg Boss Shobha Shetty: శోభా శెట్టికి పళ్లు తోమిన తేజ.. స్నానం  చేయిస్తానంటూ.. ఎత్తుకుని మరి బాత్రూమ్‌లోకి!-bigg boss 7 telugu october 31st  episode highlights and teja brushes to shobha ...

బీబీ హౌస్ లో శోభశెట్టి, టేస్టీ తేజకు మంచి స్నేహం ఏర్పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ చాలా క్లోజ్ అయిపోయారు. శోభా, తేజ అనే స్థాయి నుంచి పోరా.. పోవే అనే రేంజ్ కు వీళ్ళు ఎదిగారు. ఒకరితో ఒకరు చాలా క్లోజ్ గా ఉంటూ తెగ సందడి చేశారు. అయితే వారు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం అతనితో అదే విధంగా ఫ్రెండ్‌షిప్ ని కొనసాగిస్తుంది. తాజాగా వీరిద్దరూ కలిసి కారులో షాపింగ్ కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో శోభ, తేజ ఒక కారులో షాపింగ్ కి బయలుదేరారు. ఫుల్ గా షాపింగ్ చేసుకుని కడుపునిండా భోజ‌నంచేసి వస్తుండగా టేస్టీ తేజ.. నేను కారు నడుపుతాను అంటూ చెప్పడంతో శోభ అతడికి డ్రైవింగ్ ఇచ్చింది. ఆయన నడపడం చూసి కాస్త భయపడుతూనే.. ఒరేయి నీకు డ్రైవింగ్ వచ్చా అంటూ అడిగింది. అయితే వచ్చని చెప్తూనే నేరుగా వెళ్లి ఓ బైక్ ని గుద్దేశాడు టేస్టీ తేజ.

ఇక రాయల్ ఎన్ఫీల్డ్ బైపాస్ వెంటనే టేస్టీ తేజ కార్ వద్దకు వచ్చి ఇంకా అసలు లైసెన్స్ ఉందా, డ్రైవింగ్ వచ్చా, ఆగి ఉన్న బైకులు అలా ఢీ కొట్ట‌డ‌మేంటి ప్రశ్నించగా మాకు డ్రైవింగ్ వచ్చు.. నువ్వే వేరే రూట్ లో వచ్చే అంటూ బుఖాయించాడు టేస్టీ తేజ. మా బైక్ లైట్ గ్లాస్ పగిలిపోయింది అని చెప్పగా మా కారు కూడా డ్యామేజ్ అయిందంటూ వాదించాడు. ఓ పక్కన శోభా శెట్టి సారీ చెప్పమని అడుగుతున్నా టేస్టీ తేజ మాత్రం వారితో గొడవకు దిగాడు. ఈ లోపు అక్కడికి పోలీస్ వ్యాన్ వస్తున్న సౌండ్ రావడంతో శోభ గజగజ వానికి పోయింది. దీంతో టెస్ట్ తేజ, శోభ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి.. ఇక్కడ ఏమి గొడవ జరగడం లేదని చెప్పండి అంటూ ఆ బైకర్స్ ను బ్రతిమాలారు. వాళ్లకు సారీ చెప్పి పోలీసులు అక్కడకి రాకముందే తెస్టి తేజ, శోభ అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీన్నంతా తన వ్లాగ్‌లో షేర్ చేసుకుంది శోభా శెట్టి. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.