మెగా ఫ్యాన్స్ కు మైండ్ బ్లాకింగ్ అప్డేట్.. చెర్రీ, బన్నీ మల్టీస్టారర్.. వాళ్ళ తండ్రులుగా బాలీవుడ్ స్టార్ హీరోస్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ఇద్దరు హీరోస్ నటనలో తమ సత్తా చాటుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ కలిసి సినిమాలో నటిస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు కోరిక. అలాగే మన టాలీవుడ్ టాప్ నిర్మాత అల్లు అరవింద్ కోరిక కూడా అదేనట. అల్లు అరవింద్ ఎలాగైనా రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో కలిసి ఓ మల్టీ స్టారర్‌ని తెర‌కెక్కించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. అందుకోసమే ముందుగా ఓ టైటిల్ ని రిజిస్టర్ చేయించాను అంటూ ఇప్పటికే ప‌లు ఇంటర్వ్యూస్ లో అల్లు అర‌వింద్ వివరించాడు. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా.. అదే చరణ్ – అర్జున్.

Ram Charan sends flowers, special note to Allu Arjun for National Award win  - Hindustan Times

ఈ పేరుతో ఫిలిం ఛాంబర్‌లో ఇప్పటికే టైటిల్ రిజిస్టర్ అయిందట. ఇక బాలీవుడ్ లో టాప్ 2 హీరోలు ఎవరు అంటే టక్కున గుర్తుకొచ్చేది షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్. వీళ్లిద్దరు సినిమాలు రిలీజ్ కాకపోతే అక్కడ థియేటర్స్ డీల పడిపోతాయి.. అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళిద్దరూ కలిసి గతంలో ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. కానీ అభిమానులు బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే సినిమా కరణ్ – అర్జున్. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోష‌న్‌ డైరెక్షన్లో ఈ సినిమా తర్కెక్కింది. 1995లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ఇప్పటికే చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ ఏది వర్కౌట్ కాలేదు.

KARAN ARJUN BOLLYWOOD HINDI HD MOVIE Price in India - Buy KARAN ARJUN  BOLLYWOOD HINDI HD MOVIE online at Flipkart.com

అయితే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మాత్రం ఈ సినిమాను చరణ్ – బన్నీ కాంబోలో ఎలాగైనా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారట. అందుకే చాలా ఏళ్ల క్రితమే ఈ టైటిల్ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మల్టీ స్టార‌ర్ ట్రెండ్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్, అల్లు అర్జున్‌తో.. క‌రణ్ – అర్జున్ సీక్వెల్ తీస్తే బాగుంటుందని అల్లు అరవింద్ ఫిక్స్ అయ్యారట. ఇందులో వీళ్ళిద్దరు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు కొడుకులుగా నటిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే దీనికోసం షారుక్, సల్మాన్ ని అల్లు అరవింద్ టీం సంప్రదించారని.. వాళ్లు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. 2026 దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.