ఆ క‌మెడియ‌న్‌తో కీర్తిసురేష్ పెళ్లైపోయిందోచ్‌.. ఫొటోలు వైర‌ల్‌..!

సౌత్ స్టార్ హీరోయిన్గా కీర్తి సురేష్ సౌత్ స్టార్ హిరోయిన్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సావిత్రి.. మహానటి బ‌యోపిక్‌తో నేషనల్ అవార్డ్‌ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో మహానటి అనే పేరు కూడా ఉంది. ఇటీవల దసరా సినిమాతో సాలిడ్ హీట్ అందుకున్న కీర్తి బోళా శంకర్ మూవీలో మెగాస్టార్ చెల్లెలుగా నటించి మెప్పించింది. తాజాగా తమిళ్లో సైరన్ సినిమాతో సందడి చేస్తోంది. ఫిబ్రవరి 16న రిలీజ్ అయిన ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కీర్తి కనిపించింది. ఇక ఈ ముద్దుగుమ్మ పై ఎప్పటికప్పుడు లవ్ ఎఫైర్లు, పెళ్లి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. గతంలో స్టార్ హీరో తో కీర్తి సురేష్ ప్రేమాయ‌ణం నడుస్తుందంటూ వార్తలు వినిపించాయి. అలాగే కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచంద్రన్ తో ఎఫైర్ ఉందంటూ కూడా పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఓ స్టార్ కమెడియన్ వివాహం చేసుకుంద‌ని.. పలాన పారిశ్రామికవేతతో ఎంగేజ్మెంట్ అయిందని.. పొలిటిషన్ తో పెళ్లి జరగబోతుందంటూ.. ఎన్నో రకాల రూమర్లు వినిపించాయి.

వాటన్నింటినీ కీర్తి సురేష్ ఫ్యామిలీ ఎప్పటికప్పుడు ఖండించారు. అయితే కొన్నేళ్ళ‌ క్రితం తమిళ ప్రముఖ కమెడియన్ సతీష్ ను కీర్తి సురేష్ వివాహం చేసుకున్నారంటూ అంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కమెడియన్ సతీష్, కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రత్యక్షం కావడంతో అంత ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఇటీవల ఆ వార్తలపై సతీష్ మాట్లాడాడు. వితికారన్‌ అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సతీష్ మాట్లాడుతూ ఆ వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇళయ దళపతి విజయ్ నటించిన భైరవ మూవీలో నేను, కీర్తి సురేష్ కూడా కలిసిన నటించామని.. ఆ సినిమా షూటింగ్ టైంలో పూజ కార్యక్రమం జరుగుతుండగా.. అందరం పూలమాలలు వేసుకోవాల్సి వచ్చిందని.. అయితే నా పక్కన అప్పుడు కీర్తి సురేష్ నుంచున్నారు.. మా ఇద్దరిని మాత్రమే హైలెట్ చేస్తూ మిగతా వారిని కట్ చేసి మాకు పెళ్లయింది అంటూ వార్తలు ప్రచారం చేయడం మొదలు పెట్టారని వివ‌రించాడు.

ఇదంతా సినిమా షూటింగ్ ప్రారంభంలో జరిగిన పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోస్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. మా ఇద్దరికీ పెళ్లి అయిపోయింది అంటూ వచ్చిన వార్తలు పై నేను చాలా బాధపడ్డాను అని.. అయితే ఆ టైంలోనే కీర్తి సురేష్ అమ్మగారు మేనక నాకు కాల్ చేసి కంగ్రాచ్యులేషన్ అల్లుడు అన్నారు అంటూ చెప్పుకొచ్చింది. వెంటనే మేనక గారి మాటలకు షాక్ అయ్యానని.. తర్వాత ఆ రూమర్లను వాళ్ళు అసలు పట్టించుకోలేదని అర్థమైందంటూ చెప్పుకొచ్చాడు. 2019లో నేను సింధుని వివాహం చేసుకున్న తర్వాత ఆ పుకార్లకు చెక్ పడ్డాయని.. ఆయన చెప్పుకొచ్చాడు. ఇక తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా క్రేజ్‌ సంపాదించుకున్న సతీష్ ఇప్పటికే 70కి పైగా సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం వితికారన్‌ మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.