49 ఏళ్ల వయసులోనూ హాట్ సొగ‌సుల‌తో కుర్రాళ్ళను కవ్విస్తున్న కేజిఎఫ్ నటి.. లేటెస్ట్ ఫిక్స్ వైరల్..

బాలీవుడ్ యాక్టర్ రవీనా టండ‌న్‌కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. టాలీవుడ్‌లో ప‌లు సినిమాల‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ గత 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతుంది. 90 నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఈమె హిందీ సినిమాలు.. టీవీ షోల‌లోను సందడి చేసింది. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రవినా టండన్ స్టార్ హీరోల సరసన పలు సినిమాల్లో మెప్పించింది. ఇక తెలుగులోనే పలు సినిమాల్లో సీనియర్ బ్యూటీగా మెప్పించిన ఈమె 90లో రథసారథి, బంగారు బుల్లోడు, ఆకాశ వీధులో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి తెలుగు సినిమాల్లో మెప్పించింది.

పెద్దగా తెలుగు సినిమాలతో ఫ్రేమ్ దక్కించుకో లేకపోయిన ఈమె.. ఇటీవల కన్నడ మూవీ కే జి ఎఫ్ చాప్టర్ 2 లో నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఈమె పేరు మారుమోగిపోయింది. ఈ మూవీలో ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. తన పర్ఫామెన్స్ కు ప్రశంసలు అందాయి. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. పలు యాడ్ షూట్ లలో బిజీగా గడుపుతున్న ఈమె నెట్టింట కూడా హాట్ ఫోటోషూట్లతో సందడి చేస్తుంది. ఐదు పదుల వయసులోనూ హాట్ అందాలతో ఆకట్టుకుంటుంది. అదిరిపోయే ఔట్‌ఫిట్ తో మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఫెమీనా ఇండియా అనే మాగజైన్ కోసం రవీనా టండ‌న్ ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చింది. యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ హాట్‌ ఎక్స్ప్రెషన్స్ తో కవ్వించింది. ఆమె అందాల ప్రదర్శనకు అదిరిపోయే స్టిల్స్ కు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. టూ హాట్ గా కనిపిస్తున్నావు ర‌వీనా అంటూ.. లుక్స్ తో మెస్మ‌రైజ్‌ చేస్తున్నావ్ అంటూ.. ఈ వయసులో కూడా ఇంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావ్ అంటూ పలువురు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈమెకు తెలుగులోను మ‌రిని అవ‌కాశాలు రావాల‌ని కోరుకుంటున్నారు.