జై హనుమాన్ పై గూస్ బంప్స్ అప్డేట్.. ఆ క్రేజీ హీరో ఎంట్రీ.. అసలు గెస్ చేయలేరు..

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ హీరోల సినిమాలకు పోటీగా బరిలోకి వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకుంది. ఎన్నో రేర్ రికార్డులను క్రియేట్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ రూ.300 కోట్ల భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఎప్పటికీ థియేటర్లలో ఈ సినిమా ఆడుతూనే ఉంది.

Jai Hanuman Movie: Review | Release Date (1970) | Songs | Music | Images |  Official Trailers | Videos | Photos | News - Bollywood Hungama

కాగా తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు 2025 సంక్రాంతి బరిలో ఈ సినిమా సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుందంటూ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గతంలో అనౌన్స్ చేశారు. కాగా ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్త‌యింద‌ని వివ‌రించాడు. ఈ మూవీ సెట్స్ పైకి రాక‌ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో పలువురు స్టార్ హీరోస్ నటిస్తున్నారంటూ నెట్టింట‌ వార్తలు వైరాలైన సంగతి తెలిసిందే.

KGF Yash: Another fan on his way to see KGF actor Yash dies - The Economic  Times

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో గూస్ బంప్స్ అప్డేట్ వైరల్ గా మారింది. కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించిన య‌ష్ ఈ మూవీలో ఓ కీల‌క‌ పాత్రలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులంతా యష్ ఈ సినిమాలో నటిస్తే ఇక ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుంది.. ఇండస్ట్రియల్ హిట్ కొట్టడం పక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు.