ట్రెడిషనల్ లుక్ టూ హాట్ లుక్.. నాగార్జున చందమామ ఆషిక లేటెస్ట్ పిక్స్ వైరల్..

ఇటీవల టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ మూవీలో మన్మధుడుకి జోడిగా ఆషికా రంగనాథన్ నటించిన సంగతి తెలిసిందే. తన అందం హవ భావాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ మాటలో చెప్పాలంటే కింగ్ నాగార్జుననే తన అందం స్క్రీన్ ప్రజెన్స్‌, పర్ఫామెన్స్ విషయంలో డామినేట్ చేసింది. ఇది సాధారణ విషయం కాదు.

మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఆషిక రంగనాథన్ నటన గురించి, ఆమె హావభావాలు గురించి, అందచందాల గురించే మాట్లాడుకున్నారు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో లంగా ఓణి, చీరలో కనిపించిన ఆషిక అందరూ దృష్టిని ఆకర్షించింది. ఇక తాజాగా ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు సాంప్రదాయ బద్ధమైన లుక్ లో కనిపించే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సడన్గా హాట్ లుక్ తో దర్శనమిచ్చింది.

ఊహించిన విధంగా యధ అందాలు ఆరబోస్తూ కుర్రాళ‌ను కవ్విస్తుంది. హాట్ గ్లామ‌ర్‌తో చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. ప్రజెంట్ ఆమెకు సంబంధించిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నా సమీరంగాలో నటించిన ఆ చందమామే ఈ అమ్మాయా.. సడన్గా ఇంత మార్పు ఏంటి అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు.