వారి మాటలకు లొంగకపోవడంతో ఎన్నో అవకాశాలు చేజారిపోయాయి.. సింగర్ సునీత కామెంట్స్ వైరల్..

ఏ ఇండస్ట్రీలో ఎదగాలన్నా, కొనసాగాలన్న ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎంతో కష్టపడితే కానీ వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాదు. ఇక ఆడవారికైతే ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పవు. ఇక మగవారి ఆధిపత్యం ఉండే సినీ ఇండస్ట్రీలో అయితే చెప్పనవసరం లేదు. ఇలా ఆడవారు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొంతమంది తమ మాటలతో లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా వారి మాటలకు లొంగిపోయేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది మాత్రం ఆత్మవిశ్వాసమే ముఖ్యమని స్ట్రాంగ్ గా నిలబడి.. అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు.

Singer Sunitha going through a rough patch

అలాంటి నేపథ్యంలో ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన సింగర్ సునీత కూడా ఈ విషయాన్నే వివ‌రించింది. ఒక పాట పాడాలి అంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో చాలా దారుణమైన మాటలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తూ ఉంటారు. అయితే సింగర్ సునీత కూడా ఇదే మాటను చెప్తుంది. ఆమె కూడా తన కెరీర్‌లో ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నానని.. వారికి కావాల్సింది ఇవ్వకపోతే మాటలతో వేధిస్తారు.. అంటూ సునీత వివరించింది.

తను కూడా ఎన్నోసార్లు అవమానాలు ఎదుర్కొన్నానని.. కానీ ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు.. ఈరోజు నేనున్న నా ఇమేజ్ కారణంగా నన్ను ఎవరు వేలెత్తి చూపించడం లేదు.. కొన్నేళ్లు వెనక్కి వెళ్తే మాత్రం ఎవరి నోటికి వచ్చినట్లు వారు మాట్లాడుతూ ఉండేవారు అంటూ చెప్పుకొచ్చింది. అన్ని తట్టుకొని నిలబడ్డాను కాబట్టి ఈరోజు నేను ఈ స్టేజ్ లో ఉండగలిగా.. దేవుడి దయ వల్ల ఎవరికి లొంగాల్సిన అవసరం రాలేదు. సినీ పరిశ్రమలో ఏ బంధం శాశ్వతంగా ఉండదు. ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు.

Amid Sunitha Upadrasta's Pregnancy Rumours, Know All About Her Husband Ram  Veerapaneni - News18

మనలో టాలెంట్ ఉంటే మనల్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ స్టేజ్ లో నిలబడ్డాను. ఒంటరి మహిళగా ప్రయాణాన్ని ఏళ్లపాటు కొనసాగించా. ఇప్పుడు నాకు తోడు దొరికింది. నేను సంతోషంగా ఉన్నా. అయితే చాలామంది జీవితాలు నాకులా సుఖవంతం అవ్వవు.. సినీ పరిశ్రమ అనేది అందరూ చూసే అంత సులువైన దారి కాదు అంటూ సునిత వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.