బాలీవుడ్ రామాయణంలో లక్ష్మణుడిగా టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరో అసలు గెస్ చేయలేరు..

బాలీవుడ్ లో మరోసారి రామాయణం తెరకెక్కబోతుంది. ఈసారి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి చాలా ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆది పురుష్ సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాల్లో జరిగిన తప్పులు ఏవి తను తెరకెక్కించే సినిమాలో జరగకూడదు అని నితీష్ తివారి ఎంతో శ్రద్ధగా ఈ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఇక గత కొంతకాలంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ లో భారీ తారాగణ‌మే ఉండబోతుందంటూ తెలుస్తోంది.

Yash, Ranbir Kapoor, And Sai Pallavi: Meet Nitesh Tiwari's Dream Cast For The Ramayana Trilogy; Everything To Know

శ్రీ రాముడి గా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా కోలీవుడ్ స్టార్ యష్ నటించబోతున్నారని సమాచారం. అలాగే రామాయణంలో ఉండే మరికొన్ని ప్రధాన పాత్రలకు అంటే హనుమంతుడి పాత్రకు బాబి డియోల్, కైక పాత్రకు లారాదత్త, విభేష‌నుడి పాత్రకు విజయ్ సేతుపతి నటించబోతున్నారట. దీంతో పాటు మరో న్యూస్ సోషల్ మీడియాలో అవుతుంది. ఈ సినిమాల్లో లక్ష్మణుడి పాత్ర కోసం మన టాలీవుడ్ నుంచే ఓ క్రేజీ హీరో నటించబోతున్నాడని తెలుస్తుంది. అతను ఎవరో కాదు జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి. నితిష్ తివారికి.. నవీన్ పోలిశెట్టితో గతంలోనే మంచి సంబంధం ఉంది. ఈ కారణంగానే నితీష్ లక్ష్మణుడి పాత్రలో నవీన్‌ను తీసుకోవాలని భావిస్తున్నాడట.

Jathi Ratnalu is a stress buster: Naveen Polishetty | Telugu News - The Indian Express

గతంలో వీరిద్దరి కాంబోలో బాలీవుడ్ లో చిచోరే మూవీ వచ్చి మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో నవీన్ పోలీశెట్టి పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇది నవీన్ పోలిశెట్టి కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం నవీన్ పోలిశెట్టి నిజంగానే రామాయణంలో లక్ష్మణుడి పాత్రలో నటిస్తే ఆయన కెరీర్ కు ఇది మరింత ప్లస్ అవుతుందని సినీనివర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక ఈ రామాయణం ప్రాజెక్ట్ మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతుందట. 2025 దీపావళి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.