వామ్మో.. కృతి శెట్టి ఆ స్టార్ హీరో సిస్టరా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్..!!

కృతి శెట్టి .. ఈ పేరుకి కన్నడ బ్యూటీ నే అయినా తెలుగులో బాగా పాపులారిటీ దక్కించుకుంది . ఎంతలా అంటే ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో చెరగని స్థానాన్ని క్రియేట్ చేసుకుంది . ఉప్పెన సినిమాతో ఆమె అభిమానుల మనసుల్లో మంచి స్థానం దక్కించుకునింది.  ఆ తర్వాత కృతి శెట్టి చాలా సినిమాలలో నటించింది.  కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి.. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి .

ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కృతి శెట్టి . తమిళ్ సినిమాలలో మాత్రం బాగా స్పీడ్ పెంచేసింది.  చేతిలో మూడు ప్రాజెక్టులు పట్టుకొని టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. రీసెంట్గా కృతి శెట్టి ఖాతాలో మరో బిగ్ బంపర్ ఆఫర్ వచ్చి చేరింది.  కృతి శెట్టి హీరో అజిత్ కు సిస్టర్ రోల్ లో ఓ మూవీలో కనిపించబోతుందట . ఇది ఫుల్ టు ఫుల్ చెల్లి సెంటిమెంట్ సినిమాగా తెలుస్తుంది .

ఆ కారణంగానే కృతి శెట్టి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.  హీరో అజిత్ కి కృతి శెట్టి సిస్టరా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాలు ఎక్కువైపోతున్నాయి . మరీ ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డైరెక్టర్లు..!!