బాహుబలి, సలార్ రికార్డులను బ్రేక్ చేసిన హనుమాన్..

తేజ స‌జ్జా హీరోగా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన మూవీ హనుమాన్. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రిలీజైన ఈ సినిమా అన్ని సినిమా క‌ల‌క్ష‌న్‌ల‌ను తొక్కుకుంటూ భారీ బ్లాక్ బ‌స్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.100కోట్ల మార్క్‌ క్రియేట్ చేసి రికార్డును సృష్టించింది.

రూ.100 కోట్లు దాటేసిన 'హనుమాన్' - అక్కడ 'సలార్​', 'బాహుబలి' రికార్డ్స్​ బ్రేక్​, hanuman-movie-collections -worldwide-crossed-rs-100-crores-beats-salaar-and-baahubali-records

అదే ఊపులో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా మరో క్రేజీ రికార్డును బీట్ చేసింది హనుమాన్. ఎవరు ఊహించని విధంగా ప్రభాస్.. బాహుబలి, సలార్ రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో ప్రస్తుతం హనుమాన్ మూవీ మరోసారి నట్టింట వైరల్‌గా మారింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ ఓవర్‌సిస్‌లో సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకుంటుంది.

HanuMan Movie 6 Days Total WW Collections! : T2BLive

అక్కడ ఉన్న వారందరినీ థియేటర్ల వైపు మళ్ళించింది. ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే హనుమాన్ దాదాపు రూ.24 కోట్లను కలెక్ట్ చేసి రికార్డు ఎక్కింది. అమెరికాలో మొదటి వారంలోనే ఈ స్థాయి వసూలు సలార్, బాహుబలి రికార్డ్స్ కూడా దాటి మరీ కొలగొట్టింది హనుమాన్.