ఇన్నాళ్లు ఆ రైటర్ పైన ఆధారపడ్డ త్రివిక్రమ్.. తను లేకపోవడంతో గురూజీ పరేషాన్..

టాలీవుడ్ లో త్రివిక్ర‌మ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట రైటర్ గా నువ్వు నాకు నచ్చావు, చిరునవ్వుతో, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి హిట్ కంటెంట్లను అందించిన ఈయన.. తర్వాత డైరెక్టర్గా మారి నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖ‌లేజా లాంటి సినిమాలను తెర‌కెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాలన్నింటికీ కథలను కూడా తానే రాసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ రాసే ప్రతి కథలోను డైలాగులు అద్భుతంగా ఉంటాయి అనే ఇమేజ్ ప్రేక్షకుల్లో ఉంది.

గుంటూరు కారం' - అరే అచ్చం పవన్ సినిమాకు జరిగినట్టే జరుగుతోందిగా!,  mahesh-babu-guntur-kaaram -trailer-songs-release-coincidence-with-pawan-kalyan-agnathavasi

ఆ డైలాగులను గుర్తుపెట్టుకుని నిజ జీవితంలో వాటిని చెప్పే ఫ్యాన్స్ కూడా ఎంతోమంది ఉంటారు. డైరెక్టర్ కు హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే అది కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. త్రివిక్రమ్ కి కూడా ఓ మిడిల్ రేంజ్ హీరోకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా త్రివిక్రమ్ చేస్తున్న సినిమాల కారణంగా ఆయనకు ఉన్న గొప్ప పేరు మెల్లమెల్లగా కనుమరుగవుతుంది. గుంటూరు కారం సినిమాతో జక్కన్న గ్రాఫ్ మరింతగా పడిపోయింది. అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ సినిమాలతో డిసప్పాయింట్ చేసిన గురూజీ మళ్ళీ గుంటూరు కారం తో కూడా అదే రిజల్ట్ అందించాడు.

మహేష్ నటించిన ఈ మూవీ ఫ్లాప్ అవడంతో ఫ్యాన్స్ త్రివిక్రమ్ ఫైర్ అవుతున్నారు. ఇక త్రివిక్రమ్ పని అయిపోయిందని.. ఆయనకు మంచి కథలు రాయడం రాదు అంటూ విమర్శలు నెట్టింట మొదలయ్యాయి. ఇక త్రివిక్రమ్ మొత్తం తెలుగు రచయిత య‌ద్ద‌న‌పూడి సులోచన రాణి రాసిన నవలల నుంచి కాపీ కొడతారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆమె రాసిన న‌వ‌ల‌లో కథలను కాస్త మార్చి వాటిని సినిమాలుగా తెరకెక్కిస్తూ హిట్ కొట్టాడని.. కానీ ఇప్పుడు ఆమె చనిపోవడం ఆమె నుంచి ఎలాంటి నవలలు రాకపోవడంతో గురూజీ ఏ స్టోరీలు డెవలప్ చేసుకోలేకపోతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

PK Fans Not Happy With Trivikram's Involvement! | PK Fans Not Happy With  Trivikram

దీంతో త్రివిక్రమ్ కు పెద్ద చెక్కు వచ్చి పడింది అంటూ సరైన కథలను క్రియేట్ చేయలేకపోతున్నాడు అంటూ విమర్శిస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఆమె నవలలను ఫాలో అవుతూ.. త్రివిక్రమ్ సినిమాలు చూసేవారికి తెలియాలి. ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్‌తో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ కథతో అయినా గురూజీ హిట్ కొడతాడో లేదో చూడాలి.